వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గ్రామాల్లో....
చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ హెచ్చరిక
గుడివాడ టౌన్: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గ్రామాల్లో తిరగనివ్వమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ హెచ్చరించారు. స్థానిక ఎస్‌పీఎస్ హైస్కూల్లో మాదిగల ఆత్మగౌరవ సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదిగలను విస్మరించినందుకే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని అన్నారు. ఎంతకాలం మాయమాటలు చెప్పి మాదిగలను మోసం చేస్తారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకుంటే 18 ఉపకులాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగపోతురాజు, జిల్లా నాయకులు కంచర్ల సుధాకర్, నాగబాబు, యు.ఆశీర్వాదం, జిల్లా మహిళా ప్రతినిధి జె.ప్రశాంతి పాల్గొన్నారు.