గురజాడ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న సీఎం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లా వాసులను మభ్యపెట్టే యత్నం చేశారు. గత ఎన్నికల్లో... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పదేపదే చెబుతూ వచ్చారో... అవే అంశాలను గురువారం భోగాపురం వేదికగా చెప్పుకొచ్చారు. జిల్లాను ఇతర జిల్లాకు సమానంగా అభివృద్ధి చేస్తానని... సాంస్కృతిక రాజధానిని చేసేస్తానని... పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని... ఎంఎస్‌ఏఈ పార్కులు ఏర్పా టు చేస్తానని ఎప్పటి మాదిరిగానే చెప్పుకొచ్చారు. అయితే పదవీకాలం పూర్తయిపోవస్తుంటే... ఇంకా ఎలా అమలు చేస్తారన్నదే అందరిలోనూ నెలకొన్న సందేహం. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు గురువారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిబ్బలపాలెంవద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
భోగాపు రం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది గా అభివర్ణించారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా, పర్యటకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 1200మందికి ఉద్యోగాలు వస్తాయనీ, ప్రపంచంలో ఎక్కడకు పోవాలన్నా కనెక్టవిటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం–భోగాపురం–విశాఖపట్నం బీచ్‌రోడ్డు వస్తుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి మూడున్నరేళ్ల క్రితం ఎయిర్‌ఫోర్టు మంజూౖ రెనపుడు, ఆ తర్వాత పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చినపుడు కూడా ఇదే విషయం తెలపడం విశేషం. కనీసం టెండర్లు కూడా ఖరారు కాకుండా నే... కేంద్ర ప్రభుత్వాధీనంలోని ఈ ఎయిర్‌పోర్టుకు ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడిగా శంకుస్థాపన చేయడం అందరినీ నివ్వెరపరుస్తోంది.
మళ్లీ తెరపైకి సాంస్కృతిక రాజధాని
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబునాయుడుకు గుర్తుకు వచ్చేది విజయనగరం వైభవం. అదే తడవుగా సంగీత, సాహిత్యానికి నిలయమైన విజయనగరాన్ని సాంస్కృతిక రాజధాని చేసేస్తానన్నారు. 2014 ఎన్నికలకు ముందు విజయనగరం ఆయోధ్యామైదానం వేదికగా జరిగిన సభలో టీడీపీ అధినేత హోదాలో ఆ మాట అన్నారు. సరి గ్గా ఐదేళ్లకు భోగాపురం సభలోనూ అదే మాట చెప్పడం విశేషం. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు చేయకుండా, భవిష్యతులో చేస్తానని చెప్ప డం వింత.
విజయనగరం జిల్లా ప్రజలు మంచివారనీ, వెనుకబడిన ఈ జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తానని పునరుద్ఘాటించారు. నిజానికి ఇదే విషయం నాలుగున్నరేళ్లుగా చెబుతు న్నా... ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ పనులేమీ జరగలేదు. కనీసం ఇతర జిల్లాలతో పోల్చినా ఇక్కడ చేసింది తక్కువే. గిరిజన యూనివర్సటీ మంజూ రు చేసి నాలుగేళ్లుగా పట్టించుకోకుండా... ఇప్పు డు కేంద్రం అన్యాయం చేసిందనీ, పోరాడైనా యూనివర్శిటీ జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్పా రు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పారు. స్థలం కూడా అధికారులు గుర్తించారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ ఇప్పుడు మండలానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు అంటూ ప్రకటన చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
అమరావతి నుంచి భోగాపురం మండలం దిబ్బలపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ భోగా పురం ఎయిపోర్టుకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు గజపతినగరం చందన ఫుడ్‌పార్కు, పతంజలి ఫుడ్‌పార్కు, అరోగ్య మిల్లేట్ ప్రోసెసింగ్ యూనిట్, ప్రభుత్వ డీగ్రీ కాలేజీ, గురజా అప్పారావు యూనివర్సటీకి ఒకే వేదిక వద్ద శంకుస్థాపన చేశారు. అధికారులు ముందుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి భూమిపూజ చేశా రు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేటప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుతో భోగాపు రం, విజయనగరం కలిసిపోతాయన్నారు. జేఎన్‌టీయూ, ఏయూ క్యాంపస్ కలిపి 189 ఎకరాల్లో గురజాడ అప్పారావు యూనివర్సటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డీగ్రీ కాలేజీ వస్తుందన్నారు. ఫుడ్‌పార్కుల వల్ల అభివృద్ధి సాధించవచ్చునన్నారు. గ్రామస్వరాజ్, పోషక అభియాన్, కృషి అభియాన్‌తో జాతీయ స్థాయిలో ప్రధమస్థానం సాధించడం, పారిస్‌ఫోరం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయం సదస్సులో కలెక్టర్ హరి జవహర్‌లాల్‌కు ప్రధమస్థానం రావడంపై కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను అభినందించారు. పైడతల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించామన్నారు. ఆగర్భ శత్రువులుగా ఉ న్న విజయనగరం, బొబ్బిలి రాజవంశాలను కలిపి న ఘనత తెలుగుదేశం పార్టీదేననీ చెప్పుకున్నారు.
ఆశోక్ గైర్హాజరుపై చర్చ
కేంద్ర పౌర విమాయానశాఖ మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి ఆశోక్‌గజపతిరా జు ఎయిర్‌పోర్టుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీకి ఆయన కీలక నాయకుడు, పైగా భోగా పురం ఎయిర్‌పోర్టు విషయంలో తొలుత చొరవచూపిన వ్యక్తి శంకుస్థాపనకు రాకపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై పలువురు చర్చించుకోవడం వినిపించింది. అయితే సభలో మాట్లాడిన వారెవరూ వీటిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి.
జనానికి పాట్లు
రాష్ట్రం పరిధిలో లేని ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసి ప్రభుత్వం హడావుడి చేయాలనుకోవడం, ఆ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి సకాలంలో రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ఉదయం 10.30 నుంచి 11.30గంటల వరకు కార్యక్రమం అని ముందుగా చెప్పి, సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.40గంటలకు వచ్చారు. కార్యక్రమం 3.15వరకు సాగింది. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ముగియడంతో జనం ఆకలితో అలమటించారు. వెళ్లిపోదామంటే పోలీసులు బారికేడ్లు మూసేయడంతో కార్యక్రమం ముగిసే వరకు ఉండి పట్టపగలు చుక్కలు చూశారు. కార్యక్రమంలో రాష్ట్ర మం త్రి సుజయ్‌కృష్ణ రంగారావు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి, రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌జైన్, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ప్రసగించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలుశాఖల రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీఎం సభలో పోలీసుల ఓవర్ యాక్షన్
పూసపాటిరేగ (భోగాపురం): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకు స్థాపన సభలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సీఎం చంద్రబాబు పాల్గొనే సభకు అతి సమీపంలోనే వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అక్కడ జిల్లాస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చున్నారు. గ్యాలరీలోకి వెళ్లేందుకు పోలీసులు ఎవరిని అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు. కానీ సీబీఎన్ ఆర్మీ పేరిట వచ్చిన 100 మంది యువకులను మాత్రం అనుమతించారు. దీనిపై పలువురు బహిరంగంగానే పోలీసుల తీరును విమర్శించారు. ఏ హోదా లేని వ్యక్తులను వీవీఐపీ గ్యాలరీకి పంపించి, అవసరం ఉండి, లోపలికి వెళ్తామన్న వారిని పంపించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment