అధికారులతో సమీక్ష
ఢిల్లీలోని ఏపీభవన్ హెల్ప్‌లైన్ నంబర్ 01123782388
ఏపీ సచివాలయం హైదరాబాద్‌లో కంట్రోల్ రూం నంబర్
04023456005
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని కోస్తా జిల్లాలో శనివారం సంభవించిన భూప్రకంపనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరిన చంద్రబాబు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, విపత్తు నిర్వహణ కమిషనర్ ధనుంజయరెడ్డి, తన కార్యాలయ ముఖ్య కార్యదర్శితో సమీక్షించారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించిందని, ఎలాంటి భయం లేదని అధికారులు తెలిపారు. విదే శాంగశాఖ సంయుక్త కార్యదర్శి గోపాల్‌భాగ్లేతో మాట్లాడిన చంద్రబాబు నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుపై రెసిడెంట్ కమిషనర్ వీణా ఈష్‌తో ఆయన చర్చించారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి నేపాల్ వెళ్లినవారి గురించి ఆరా తీసి.. వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిపై కోస్తా జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు. పరిస్థితులను తెలుసుకొని తగు ఆదేశాలు జారీ చేశారు.
భూప్రకంపనలపై సీఎం ఆరా..
Published Sun, Apr 26 2015 2:49 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
Advertisement
Advertisement