ఏలూరు (సెంట్రల్) : ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై జిల్లాలోని కౌలు రైతులు కన్నెర్ర చేశారు. రుణమాఫీ హామీని తక్షణమే అమలు చేయకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అన్నదాతల సంక్షేమాన్ని విస్మరిస్తే సర్వనాశనం తప్పదంటూ శాపనార్థాలు పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కౌలు రైతులు రుణభేరి పేరిట రణభేరి మోగిం చారు. ఏపీ కౌలు రైతు సంఘం పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టుబడులు లేక కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ప్రభుత్వం వారిని ఎంత మాత్రం పట్టించుకోకుండా రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన కూడా చేయకపోవడం దారుణమని ఆక్షేపిం చారు. రుణమాఫీపై ఇప్పటివరకు అంతోఇంతో ఉన్న ఆశలు కూడా ఆగస్టు 14న విడుదల చేసిన జీవోతో అడుగంటిపోయాయని పేర్కొన్నారు. ఈ జీవో ప్రకా రం రుణమాఫీకి విధిగా పట్టాదార్ పాస్ పుస్తకం లేదా రుణ గుర్తింపు కార్డు ఉండాలంటూ కొత్త మార్గదర్శకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీంతో రెండూ లేని కౌలు రైతుల రుణం మాఫీ అయ్యే సూచనలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీకాక జిల్లాలో నీలం తుపానుకు నష్టపోరుున కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం చేరలేదని వాపోయూరు. పాత రుణం మాఫీకాక, కొత్త రుణం అందక కౌలు రైతులు పడుతున్న పాట్లను దృష్టిలో ఉంచుకుని బేషరతుగా ప్రభుత్వం తక్షణం రుణాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాఫీ వర్తించాలంటే రుణ గుర్తింపు కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండాలనే జీవో నంబర్ 174లోని 21వ నిబంధన నుంచి రైతుమిత్ర గ్రూపులను మినహాయించాలని కోరారు. పంట రుణాలు అయి ఉండాలనే నిబంధన నుంచి పంటేతర రుణం పొందిన జేఎల్ గ్రూపులు, కౌలు రైతులు బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలను మినహాయించి వాటిని కూడా పంట రుణాలుగానే గుర్తించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
రైతుల బాధలపై చర్చ జరపండి
సీపీఎం జిల్లా కార్యదర్శి మంతెన సీతారామ్ మాట్లాడుతూ రుణమాఫీ చేయక, కొత్త రుణాలు అందక రైతులు అడకత్తెరలో పోకచెక్కలా అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. పంటల్ని ఎలా సాగు చేయూలో అర్థంకాక సతమతం అవుతున్న రైతుల సమస్యలపై ఇకనైనా అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను కలసి సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్, కార్యదర్శి చింతకాయల బాబూరావు, రైతు సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బి.బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా శాఖ కార్యదర్శి ఎ.రవి, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా శాఖ అధ్యక్షుడు సుందరబాబు పాల్గొన్నారు.
రుణమాఫీ జాప్యంపై రణభేరి
Published Thu, Aug 21 2014 1:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement