మహిళలను ముంచేశారు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: అధికార దాహంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణ మాఫీ హామీ మహిళా సంఘాలను కష్టాల్లోకి నెట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడింది. ఫలితంగా ఆర్థికంగా బలపడాల్సిన సం ఘాలు నీరసించిపోతున్నాయి. బాబు ఇచ్చిన హామీని నమ్మి ఆరు నెలలుగా రుణాలకు సంబంధించిన నెలవారీ వాయిదాలను మహిళా సంఘాలు చెల్లించకుండా నిలిపివేశారు. దీంతో మహిళా సంఘాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తించడం లేదు.
దీనికితోడు అసలు, వడ్డీని చక్రవడ్డీతో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతవరకూ రుణమాఫీ అవుతోందని ఆశించిన సంఘాలకు మాఫీ లేదని ప్రభుత్వం ప్రకటించడం, లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఎప్పుడు అందజేస్తారో స్పష్టత లేకపోవడంపై మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. చంద్రబాబు మాటలకు మోసపోయామని లబోదిబో మంటున్నారు. జిల్లాలో రుణాలు పొందిన సంఘాలు 42,176 ఉన్నాయి. ఈ సంఘాలు గడచిన రెండేళ్లుగా బ్యాం కుల నుంచి 628 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీలను పొందారుు.
సంఘాల సభ్యులు నెలకు సుమారు రూ. 20 కోట్లు వాయిదాల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే సంఘాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తోంది. అరుుతే అధికారం కోసం ఎన్నికల ముందు చంద్రబాబు డ్వాక్రా మహిళలు వాయిదాలు కట్టవద్దని హామీ ఇచ్చారు. దీన్ని నమ్మిన సంఘాల సభ్యుల్లో కొంతమంది మార్చి నెల నుంచి, మరికొందరు ఏప్రిల్ నుంచి నెలవారీగా బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ వాయిదాలను కట్టడం నిలిపివేశారు. అరుుతే ఇప్పుడు రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేయడంతో మహిళా సం ఘాలపై వడ్డీ రుపేణా పెనుభారం పడింది. క్రమంగా వాయిదాలు చెల్లించకపోవడంతో పూర్తి వడ్డీ రాయితీ నిబంధనల మేర వర్తిం చడం లేదు. బ్యాంకు అధికారులు సంఘాలకు అసలు, వడ్డీ, చక్రవడ్డీలు వేస్తున్నారు.
ఈ వడ్డీలు నెలకు సుమారుగా రూ. 6 కోట్లు వరకూ మహిళపై భారం పడింది. ఇలా గడచిన ఆరు నెలలుగా 36 కోట్ల రూపాయల అదనపు భారం పడడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. రుణ మాఫీ చేయకుండా సంఘానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అదికూడా ఇంతవేగంగా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఇచ్చిన ఆర్థిక సహాయం రుణ ఖాతాకు మళ్లిస్తారా? లేక పొదుపుఖాతాలో జమచేస్తారా? గ్రామ సంఘం ఖాతాలో జమచేస్తారా అన్నదానిపై స్పష్టత లేకపోవడంపై మహిళలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమను నిండా ముంచేశారని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో జిల్లాలోని పలు సంఘాలు ఆర్థిక భారంతో బలహీన పడే పరిస్థితులు నెలకొన్నారుు.
రుణ లక్ష్యం చేరేనా ?
డ్వాక్రా సంఘాల కొత్త లింకేజీలకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ, ఆర్థిక సహాయం సమస్యగా మారింది. గతంలో రుణాలు పొందినవారు వాయిదాలు చెల్లించకపోవడంతో కొత్త గా రుణాన్ని ఇచ్చేందుకు బ్యాంకులు ముం దుకు రావడం లేదు. ఈ ఏడాది కొత్త రుణ ల క్ష్యాన్ని చేరేందుకు ఇబ్బందులు పడుతున్నామని అధికారులంటున్నారు. గత ఏడాది 112 శాతం లక్ష్యాన్ని సాధించారు. ఈ ఏడాది టార్గెట్ రూ. 850.67 కోట్లు కాగా, ఇంతవరకు ఇచ్చిన రుణాలు రూ.37.62 కోట్లు మాత్రమే కావడంతో లక్ష్యం చేరడం అనుమానమే.