వడ్డీతో సహా బకాయిలు కట్టాల్సిందే! | Chandrababu Naidu Cheating Woman On Loan Waiver | Sakshi
Sakshi News home page

వడ్డీతో సహా బకాయిలు కట్టాల్సిందే!

Published Wed, Sep 3 2014 2:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

వడ్డీతో సహా బకాయిలు కట్టాల్సిందే! - Sakshi

వడ్డీతో సహా బకాయిలు కట్టాల్సిందే!

 విజయనగరం అర్బన్ : తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు డ్వాక్రా మహిళల రుణాలను కూడా రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ...అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు కావస్తున్నా..రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో బ్యాంకులు రు ణాలు తీసుకున్న మహిళా సంఘాలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. వడ్డీతో సహా బకాయిలు చెల్లించాల్సిం దేనని స్పష్టం చేస్తున్నాయి. దీంతో మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా కట్టాల్సిందేనం టూ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు.
 
 దీంతో రుణమాఫీ జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్న మహిళలు అయోమయంలో పడుతున్నారు. జిల్లాలో మొత్తం 60 వేల ఎస్‌హెచ్‌జీ సంఘాలు ఉండగా...అందులో 95 శాతం సంఘాలు రుణాలు తీసుకున్నాయి. వీరు ప్రతి నెలా రూ. 100 కోట్ల వరకు బ్యాంకులకు రు ణాలు చెల్లించేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటిం చారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి నెల నుంచి చాలామంది మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశారు. అప్పటి నుంచి జూన్ వరకు ఎస్‌హెచ్‌జీ మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 400 కోట్ల వరకు ఉంది. ప్రభుత్వం రుణమాఫీకి బదులుగా రూ. లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని చేసిన ప్రకటనలో స్పష్టత లేకపోవడం, సభ్యులకు అవగాహన కలిగించకపోవ డం వంటి కారణాల వల్ల డ్వాక్రా మహిళలు ఇంకా రుణమాఫీ ఆశల్లో నే ఉన్నారు.
 
 ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో 14 శాతం వడ్డీతో పా టు వారం రోజుల్లో రుణాలు కట్టాల్సిం దేనంటూ బ్యాంకర్లు నోటీసులను జారీ చేస్తున్నా రుు. చివరి నోటీసు పంపిన తపాలా చార్జీలు కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంటున్నాయి. అయితే అధిక మొత్తంలో వడ్డీ వేయడం, ముందుగా ఐకేపీ సిబ్బంది గాని, బ్యాంకర్లు గాని కనీసం చెప్పకుండా నోటీసులు ఎలా ఇస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కోక్క సంఘం వడ్డీ రూపంలోనే రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు చెల్లించాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొంటున్నారు. పొదుపు ఖాతాల నుంచి రుణాల మొత్తాలకు జమ చేసుకున్న సంఘాలకు కూడా బ్యాంకర్లు రూ. 14 వేల మేరకు వడ్డీ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశా రు. ఇదిలా ఉండగా ఒకే ఇంటికి ఇటు డ్వాక్రా, అటు పంట రుణాలకు సంబంధించిన నోటీసులను బ్యాంక్లు పం పారు. రెండు నోటీసులు అందుకున్న కుటుంబాలు రుణాల కన్నా వడ్డీలే అధికంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.
 
 రుణాలు కట్టేది లేదు..
 మాఫీ చేయాల్సిందే : మహిళా సంఘాలు
 ప్రభుత్వం రుణమాఫీ చేసే వరకూ రుణాలు కట్టేది లేదని విజయనగరం పట్టణంలోని 1వ వార్డు రాళ్లమాలపల్లి పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు స్పష్టం చేశారు. మంగళవారం సుమారు 30 మహిళా సంఘాల సభ్యులు సమావేశమయ్యారు. రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామంటే నమ్మి టీడీపీని గెలిపించామని, కానీ ఇప్పటివరకూ రుణమాఫీ చేయకుండా కాలయూపన చేయడం సరికాదని ప లువురు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేసే వరకు రుణాలు కట్టేది లేదని తెలిపారు.
 
 అధిక వడ్డీ వేశారు
 
 మేము రూ. 5లక్షల రుణాన్ని బ్యాంకు ద్వారా తీసుకున్నాం. ప్రతి నెలా వాయిదాలు కడుతున్నాం. జనవరిలో రుణం తీరిపోయింది. తరువాత మళ్లీ అంతే మొత్తాన్ని రుణంగా తీసుకున్నాం. అయితే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పడంతో నాలుగు నెలలుగా వాయిదాలు కట్టలేదు. కానీ తీసుకున్న రుణం మొత్తానికి కలిపి రూ. 16 వేల వరకు అధిక వడ్డీ వేసి, బ్యాంకు నోటీసులు పంపారు.
 - డి.దీప, ప్రభు గ్రూప్,  రాళ్లమాలపల్లి, విజయనగరం
 
 మాఫీ చేయమని అడగలేదే...
 డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ఏ ఒక్క మహిళలైనా అడిగిందా..? ఓట్లు దండుకోడానికి టీడీపీ నాయకులు రుణమాఫీ సాధ్యమా..? కాదా అన్నది కూడా ఆలోచించకుండా హామీ ఇచ్చారు. ఇప్పుడేమె రుణాలు చెల్లించాలని బ్యాంకుల నోటీసులు పంపిస్తున్నా.. స్పందించడం లేదు.
         - డి.కన్నమ్మ, సాయిగ్రూప్,
 ఒకటో వార్డు,
 విజయనగరం

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement