విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వాహనాన్ని బాబు ఎస్కార్ట్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఓ ఎస్ఐ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా రెండురోజుల విశాఖ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పలువురు పార్టీ నేతలు ఉన్నారు.
చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి
Published Fri, Aug 8 2014 11:37 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM
Advertisement
Advertisement