చంద్రబాబు అవినీతికి అడ్డూఅదుపులేదు | Chandrababu naidu corruption is high | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అవినీతికి అడ్డూఅదుపులేదు

Published Tue, Feb 23 2016 2:18 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

చంద్రబాబు అవినీతికి అడ్డూఅదుపులేదు - Sakshi

చంద్రబాబు అవినీతికి అడ్డూఅదుపులేదు

వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి

కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శించారు.  అవినీతికి అడ్డొచ్చిన అధికారులను స్థానభ్రంశం కల్పిస్తున్నారని, ఇందుకు తాజాగా నగరాభివృద్ధి, యాజమాన్యసంస్థ చైర్మన్ అజయజైన్‌పై వేటు వేయడమే ఉదాహరణ అన్నారు.  సింగపూర్ సంస్థల ప్రతిపాదనలకు లొంగి ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో  టెండర్ నోటిఫికేషన్‌కు సిద్ధమవ్వడం సబబు కాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ అమలు విషయంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతు ం దని, కొన్ని శాఖల్లో ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement