బాబు రాక.. జాబు పోక
రావులపాలెం :జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఊడగొట్టారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విమర్శిం చారు. ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు నిర్ణయానికి నిరసనగా మంగళవారం స్థానిక కళా వెంకట్రా వు సెంటర్‌లో మానవహారం నిర్వహంచి, జా తీయ రహదారిని దిగ్బంధించారు. ఆదర్శ రైతుల సంఘ రాష్ర్ట అధ్యక్షుడు నలగం శేఖర్, కార్యదర్శి ఏడుకొండలు, జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయరెడ్డి నాయకత్వంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, వైస్ ఎంపీపీ దండు వెంకటసుబ్రహ్మణ్య వర్మ, కాంగ్రెస్ నాయకుడు ఆకుల రామకృష్ణ మద్దతు తెలి పారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు, వ్యవసాయాధికారులకు మధ్య వారధిగా ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవస్థను రద్దు చేయడానికి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు చర్యలు చేపట్ట డం సమంజసం కాదన్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల సుమారు 29 వేల మంది నిరుద్యోగులుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టకపోయినా, ఎనిమిదేళ్లుగా సేవలందిస్తున్న ఆదర్శరైతులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదేనా విజన్ 2020 అని దుయ్యబట్టారు. ఆదర్శరైతులకు అన్యాయం జరగకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఆదర్శరైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆదర్శ రైతులు రోడ్డున పడే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తాననడం సమంజసం కాదన్నారు. రాజకీయ పార్టీల సహకారంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఆదర్శరైతులకు సాంకేతిక నైపుణ్యంపై ప్రభుత్వమే శిక్షణ ఇప్పించాలని కోరారు.
స్తంభించిన ట్రాఫిక్
ఆదర్శ రైతుల ఆందోళన ఫలితంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలి గింది. సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభిం చింది. కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశా రు. కార్యక్రమంలో ఆదర్శరైతు నాయకులు వెంకటరమణ, టి.జానకిరామ్, కె.వీరాంజనేయులు, టి.ఆదిత్యారెడ్డి, ఎ.చినవెంకట రమణ, వీరరాజు తదితరులు పాల్గొన్నారు.