రాష్ట్రంలో ఉద్రిక్తతలపై శరద్యాదవ్ ఆవేదన | Chandrababu Naidu met Sarad Yadav | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఉద్రిక్తతలపై శరద్యాదవ్ ఆవేదన

Published Sun, Sep 22 2013 3:23 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

Chandrababu Naidu met Sarad Yadav

న్యూఢిల్లీ:  రాష్ట్రంలో  నెలకొన్న పరిస్థితులపై జెడియు నేత శరద్‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు శరద్‌యాదవ్‌తో సమావేశమయ్యారు.  కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని చంద్రబాబు శరద్‌యాదవ్‌కు వివరించారు. విభజన అనంతరం దిగ్విజయ్‌ సింగ్‌ టీఆర్‌ఎస్‌ విలీనం గురించి మాట్లాడడాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చితే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం బాధాకరం అని శరద్‌యాదవ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement