‘వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేదిలేదు’
అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితితో పాటు నేతల పనితీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో పార్టీ నేతలంతా సమన్వయంతో పని చేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా విభేదాలు పక్కన పెట్టడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభేదాలతో రోడ్డున పడ్డ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డితో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందన్న చంద్రబాబు... జేసీపై చర్యలకు మాత్రం నోరు మెదపలేదు. అంతేకాకుండా జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారంపై నేతలు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు సూచించడం గమనార్హం. కాగా అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ స్థానంలో పుల నాగరాజు బాధ్యతలు స్వీకరించారనున్నారు. అలాగే పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌గదా గంగన్న స్థానంలో చలపతి బాధ్యతలు చేపట్టనున్నారు.