హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వసంతోత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. కాగా చంద్రబాబు నాయుడుతో పాటు పెప్సికో ఛైర్మన్ ఇంద్రనూయి కూడా వెంకన్నను దర్శించుకున్నారు.
కాగా చంద్రబాబు నాయుడు శ్రీసిటీలో 12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 11 నూతన పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు. పెప్సీకో కంపెనీ సీఈవో ఇంద్రనూయి, ఇతర ప్రముఖుల సమక్షంలో ఆయన తొలుత పెప్సీకో పానీయ, ఆహార వస్తు ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వెస్టుఫార్మా పరిశ్రమను ప్రారంభించి డేనియలీ కంపె నీ వందో వార్షికోత్సవంలో పాల్గొంటారు. తరువాత బిజినెస్ సెంటర్‌లో ఉత్పత్తి దశకు చేరిన జెడ్‌టీటీ, నిస్సాన్, నిట్టాన్, వాల్వ్, ఎంఎం హలీ టెక్, కుసాకబే, వైటల్ సొల్యూషన్, సిద్ధార్థ లాజి స్టిక్, సీఎక్స్ ప్రిసిషన్, ఆర్చురా ఫార్మాస్యూటికల్ను ప్రారంభిస్తారు.
వెంకన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Published Fri, Apr 3 2015 8:10 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
Advertisement
Advertisement