సాక్షి, చంద్రగిరి (చిత్తూరు జిల్లా): బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియో తీసి, బెదిరించి లైంగిక దాడులకు పాల్పడిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలవడం సిగ్గుచేటని బాధిత బాలిక బంధువులు మండిపడ్డారు. మీ ఇంటి అయ్మాయికి అన్యాయం జరిగితే ఇదే న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రగిరి మండలంలోని దళితవాడకు చెందిన బాలికపై ఇటీవల అత్యాచారానికి పాల్పడిన నిందితులు చంద్రగిరి సమీపంలో గురువారం పార్టీ సమావేశంలో ఉన్న చంద్రబాబును కలిశారు.
వారికి అండగా నిలుస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం, ఈకేసు విషయంలో పోలీసులపై మండిపడడంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడు ఆ ఫోటోలు, వీడియోలను తన స్నేహితులైన మరో ముగ్గురు మైనర్లతో పాటు జగపతి(23) అనే వ్యక్తికి షేర్‌చేశాడు. తమ కోరిక కూడా తీర్చాలని, లేకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంత నీచానికి పాల్పడిన వారికి చంద్రబాబు అభయం ఇవ్వడం ఏమిటి? అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment