విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోటు పుస్తకాలను అందిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు
చిత్తూరు, తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విద్య పట్ల తన అంకితభావాన్ని చూపుతూనే ఉన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని ఆయన చెబుతూ ఉంటారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో చదువుతున్న 43 వేలమంది విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులు.. క్లాస్‌మేట్ నోట్ పుస్తకాలను ఆయన అందించారు. స్కూళ్ల వారీగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి వాటిని విద్యార్థులకు అందించారు. బ్యాగ్, నోట్ పుస్తకాలు అందుకున్న చిన్నారులు ‘థ్యాంక్యూ ఎమ్మెల్యే అంకుల్...’ అం టూ కృతజ్ఞతలు తెలిపారు.
పేదరికం అడ్డు కాకూడదు...
చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే నియోజకవర్గంలో చదువుకునే ప్రతి విద్యార్థికి సొంత నిధులతో స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలను అం దిస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తుమ్మలగుంటలోని ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులకు బ్యాగ్‌లు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలను అ«ధిరోహించè వచ్చన్నారు. విద్య ఉన్నచోట పేదరికం ఉండదన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, వైఎస్సార్ విద్యార్థి విభాగం చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, దామినేటి కేశవులు, దొడ్ల కరుణాకర్‌రెడ్డి,విడుదల మాధవరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, వీరనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment