రేపు సీఎం జిల్లాకు రాక
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి 5 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.10కి అక్కడనుంచి బయల్దేరి 5.30 గంటలకు పుష్కర ఘాట్ చేరుకుంటారు. 5.45 నుంచి 6.15 గంటల వరకూ అక్కడ వెయ్యిమంది కళాకారులు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 6.15 నుంచి 6.30 గంటల వరకూ పుష్కర అఖండ స్వాగత జ్యోతి యాత్రలో పాల్గొని జ్యోతిని అందుకుంటారు. 6.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ గోదావరి అఖండ నిత్య హారతిలో పాల్గొంటారు. 7 నుంచి 7.30 గంటల వరకూ పుష్కర ఘాట్‌లో ఆకాశ లాంతర్లను విడుదల చేస్తారు. 7.30 నుంచి 7.45 గంటల వరకూ హేవలాక్ బ్రిడ్జ్ వద్ద లేజర్ షోను, 7.45 నుంచి 8 గంటల వరకూ బాణసంచా కాల్పులను తిలకిస్తారు. అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాలకు చేరుకుని 8.10 గంటలకు డ్వాక్రా బజార్‌ను ప్రారంభిస్తారు. 8.15 గంటలకు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న అనంతరం రాత్రికి ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. 14 ఉదయం గోదావరి పుష్కరాలను ప్రారంభిస్తారు.