
'విభజనపై సోనియా నిర్ణయమే శిరోధార్యం'
రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయమే శిరోధార్యమని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్లో మాట్లాడుతూ... ఈ నెలాఖరులోగా టి.బిల్లు అసెంబ్లీకి వస్తుందని తెలిపారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే విప్ జారీ చేసే అవకాశం ఉండదన్నారు.
భద్రచలంతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకే కాంగ్రెస్ అధిష్టానం కట్టుబడి ఉందని గండ్ర వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసునని గండ్ర వెంకటరమణ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు.