వేపాడ: చెంగు..చెంగున..గెంతుతూ ఆడుతూ పాడుతూ తోటి విద్యార్థులతో చదువుకుంటున్న వయస్సులో ఓ చి న్నారిని బ్లడ్ క్యాన్సర్ మహమ్మారి పీడిస్తోంది. ఎప్పు డూ హుషారుగా ఉండే చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ సోకిన ట్లు నిర్దారణ కావడంతో తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించి వేపా డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ టి.జయశ్రీ, పాఠశాల సిబ్బంది అందించి వివరాలు ఇ లా ఉన్నాయి. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన ఎజ్జల మరియదాసు, మరియ దంపతులకు మార్తె స్వాతి వేపాడ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. 2015 జనవరిలో పండగ సెలవులకు ఇం టికి వెళ్లిన స్వాతి అనారోగ్యంతో బాధపడడంతో వైద్యులకు చూపించిన తల్లిదండ్రులు మందులతో పాఠశాలకు తీసుకొచ్చారు.
మందులు అయిపోవడంతో ఫిబ్రవరి నెల మొదటివారంలో విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తామని స్వాతి తండ్రి మరియదాసు తీసుకెళ్లారు. జిల్లాకేంద్రంలో వైద్యపరీక్షల అనంతరం బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించిన వైద్యులు విశాఖ కేజీహెచ్ రిఫర్ చేశారు. కేజీహెచ్‌లో మూడురోజుల పాటు వైద్యసేవల అనంతరం వైద్యులు ఈ వ్యాధికి సంబంధించి హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లే స్థోమత లేక స్వగ్రామానికి తీసుకెళ్లిపోయా రు.
అదే గ్రామానికి చెందిన పలువురు పిల్లలు వేపాడ పాఠశాలలో చదువుతున్నందున వారు పాఠశాలకు వచ్చినపుడు స్వాతికి బ్లడ్‌క్యాన్సర్ అని ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ టి.జ యశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, హౌస్ టీచర్ సునీ తలు స్వాతి స్వగ్రామం ముగడ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి తక్షణమే విశాఖ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో టెస్ట్‌లు చేసిన అనంతరం హైదరాబాద్ లోనే ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అందుతుందని వైద్యులు చెప్పడంతో ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు స్వాతిని ఫిబ్రవరి 17వ తేదీన హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ లేనందున ట్రీట్‌మెంట్ చేయలేమని చెప్పడంతో లక్డీకాపూల్‌లోని ఎంఎన్‌జె ఆస్పత్రిలో చేర్చారు. మార్చి17వ తేదీ వరకు ట్రీట్‌మెంట్ చేసి కొంత తేరుకోవడంతో డిశ్చార్జి చేశారు.
తిరిగి మార్చి 25వ తేదీకి హైదరాబాద్ తీసుకొస్తే వైద్యసేవలు అందిస్తామని వైద్యులు చెప్పారు. మొదటిదఫా ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ఖర్చులు, తల్లిదండ్రుల భోజనాలు, రక్తం కొనుగోలు తదితర వాటికి సుమారు రూ.75వేలు పాఠశాలనుంచి ఖర్చు చేయడంతోపాటు సిబ్బంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయితే 25వ తేదీన స్వాతిని హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిన తల్లిదండ్రులు స్థోమత లేదు. డబ్బులులేవు అని తీసుకెళ్లడంలేదంటున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు.
దాతలూ ఆదుకోండి
చదువుకుంటున్న వయస్సులో చిన్నారి స్వాతికి వచ్చిన పెద్దకష్టానికి దాతలు సహకరించి ఆదుకోవాలని తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది కోరుతున్నారు. హైదరాబా ద్ 25వ తేదీకి చేరుకుని ఆస్పత్రిలో చేర్పిస్తే వైద్యసేవలు అందుతాయని వేడుకుంటున్నారు. సహాయం అందించే దాతలు ప్రిన్సిపాల్ టి.జయశ్రీ ఫోన్ నంబర్ 9704550021. స్వాతి తండ్రి మరియదాసు ఫోన్ నంబర్ 9652489066ను సంప్రదించవచ్చని కోరారు. స్వాతికి సహాయపడేవారు ప్రిన్సిపాల్ స్టేట్‌బ్యాంకు ఖాతా నంబర్ 33937537366లో జమచేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆశల దీపాన్ని కాపాడండి
Published Wed, Mar 25 2015 4:04 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement