vepada
-
ప్రకృతి వ్యవసాయం వైపు పయనం
వేపాడ: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆ ధారపడాల్సి వస్తోంది.అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అలాగే మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరు గుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2016లో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 2016– 17లో 10 క్లస్టర్లలో 50 గ్రామాల్లో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. 2021–22 సంవత్సరంలో 61 క్లస్టర్లలో 34 మండలాల్లో 309 గ్రామాల్లో 41,761 మంది రైతులతో 18,382 హెక్టార్లల్లో ప్రకృతి వ్యవసాయం చేయించారు. 2022–23 సవత్సరంలో 64, 945 మంది రైతులతో 65,651 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఖరీఫ్‌లో 49వేల మంది రైతులతో 57,700 ఎ కరాల్లో నవధాన్యాల సాగుకు సిద్ధమయ్యారు. విస్తృతంగా అవగాహన సుస్థిర వ్యవసాయకేంద్రం, ప్రకృతి వ్యవసాయకేంద్రం, ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు సోకే చీడపీడల నివారణకు రసాయన పురుగుమందులకు బదులు పొలొల్లానే ఖర్చు లే కుండా ఘన, ద్రవ జీవామృతాలు, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, జిల్లేడు ద్రావణం, మీనామృతం, తదితరాలను తయారీ చేయిస్తున్నారు. పంటలకు హాని చేసే పురుగులు, కీటకాల నివారణకు పసుపు, తెలుపు పళ్లాలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయిస్తున్నా రు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు పెట్టుబడి కూడా ఆదా అవుతుండడంతో రైతులు క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. రాయితీపై విత్తనాలు భూమిలో సేంద్రియ కర్బనశాతం పెంచేందుకు ఖరీఫ్ ప్రధాన పంట సాగుకు ముందు నవధాన్యాలను పచ్చిరొట్ట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మినుములు, పెసర, బొబ్లర్లు, చిక్కుడు, ను వ్వులు, ఆముదం, వేరుశనగ, ధనియాలు, మెంతులు, ఆవాలు, రాగులు, మొక్కజొన్న, కొర్రలు, సామాలు, ఆనస, దోస, టమాటా, ముల్లంగి, బంతి తదితర విత్తనాలను, పచ్చిరొట్ట జాతులైన కట్టె జనుము, పిల్లిపెసర, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. 65వేల ఎకరాల్లో సాగు లక్ష్యం జిల్లాలో ఏటా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 65,651 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలను రూపొందించి క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేస్తున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయాధికారి, విజయనగరం. అవగాహన కల్పిస్తున్నాం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంట వేసేముందు రైతులే విత్తనశుద్ధి చేసుకునేలా చైతన్యం కలిగించాం.ఈఏదాది ఉన్నతాధికారులు నిర్ధేశించిన మేరకు లక్ష్యాలను చేరుకునేలా క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాం. – కె.వెంకటరావు, సీఎస్ఏ, బొద్దాం క్లస్టర్. -
ప్రార్థించే పెదవుల కన్నా..
‘మాట్లాడే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న’ సూక్తిని ఆదర్శంగా తీసుకున్నారు. త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నారు. ఉన్న దాంట్లో కొంత పేదలకు పంచుతున్నారు. అనారోగ్య బాధితులకు ఆసరా అందిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పేదల హృదయాల్లో నిలిచిపోతున్నారు. నలుగురికీ స్ఫూర్తినిస్తున్నారు.. వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన హెల్పింగ్ హేండ్స్ మన నేస్తం ట్రస్ట్ నిర్వాహకులు. చేయి చేయి కలిపి.. బానాది గ్రామంలో 2010 ఏప్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వ్యవసాయం తదితర వృత్తులపై ఆధారపడిన ఇరవై మంది సభ్యులతో కలసి ‘హెల్పింగ్ హేండ్స్ మన నేస్తం ట్రస్ట్’ను ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ అధ్యక్షునిగా కర్రి వి.ఆర్.సన్యాసినాయుడిని ఎన్నుకున్నారు. నాటి నుంచి ట్రస్ట్ సభ్యులు ప్రతి నెలా కొంత ధనం వెచ్చించి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మరికొందరు సేవా దృక్పథంతో ట్రస్ట్ సభ్యులుగా చేరటంతో ప్రస్తుతం 85 మంది సభ్యులతో నడుస్తోంది. ట్రస్ట్ పేరుతో ఏదో సేవా కార్యక్రమం చేసి చేతులు దులిపేసుకోకుండా.. సొంత సొమ్ము వెచ్చించి ప్రతినెలా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. ప్రతి నెల పేదలకు సరుకులు హెల్పింగ్ హేండ్స్ మన నేస్తం ట్రస్ట్ సభ్యులు బానాది పరిసర గ్రామాలకు చెందిన నిజమైన నిరుపేదలను 88 మందిని ఎంపిక చేసుకుని ప్రతి నెలా సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బానాది, ఎం.శింగవరం, బల్లంకి, అంకాజోస్యులపాలెం, ఎ.భీమవరం, ఆతవ, వేపాడ, వల్లంపూడి, రెడ్డిపాలెం, లచ్చంపేట, పోతంపేట, దేవాడ తదితర గ్రామాలకు చెందిన 88 నిరుపేదలకు ప్రతి నెలా శనగపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు, పిండి తదితర నిత్యావసర వస్తువులను గ్రామంలో రామాలయం వద్ద అందజేస్తున్నారు. నేటికి ఎనిమిదేళ్లుగా సేవాభావంతో పేదలకు నిరాటంకంగా సరుకులు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండగ రోజు పేదలకు వస్త్రాలు ఏటా సంక్రాంతికి ఎంపిక చేసిన పేదలు 100 మందికి బట్టలు పంపిణీ చేస్తున్నారు. పండగ రోజు నూతన వస్త్రాలతో ఆనందంగా గడపాలన్న ధ్యేయంతో ట్రస్ట్ సభ్యులు నిరుపేదలకు బట్టలు ఇస్తున్నారు. ఏటా బానాది పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అనారోగ్య బాధితులకు అండ పేదలెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న సమచారం తెలిస్తే ట్రస్ట్ సభ్యులు తామున్నామంటూ ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ సేవలకు ఎవరివద్ద ఎలాంటి నిధులు సేకరించకుండా ట్రస్ట్ సభ్యులు ప్రతి నెలా తమ సంపాదనలో వీలైనంత కేటాయిస్తున్నారు. మండలంలో బొద్దాం, ఓబలయ్యపాలెం, అంకాజోస్యులపాలెం తదితర గ్రామాల్లోని ట్రస్ట్ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం, పేదలకు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. – వేపాడ (శృంగవరపుకోట) సేవాభావంతోనే.. మేమంతా రైతు కుటుంబాలకు చెందినవారం. భగవంతుని దయ వల్ల మాకు ఉపాధి కలిగింది. మా సంపాదనలో ఎంతో కొంత కేటాయించి పేదలకు సహాయపడాలన్న లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. గ్రామానికి చెందిన 50 మంది సభ్యులతోపాటు మా స్నేహితులు మరో 40 మంది సేవా కార్యక్రమాలు చూసి ట్రస్ట్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. – కె.వి.ఆర్.సన్యాసినాయుడు, అధ్యక్షుడు, మన నేస్తం ట్రస్ట్, బానాది, వేపాడ -
అవగాహనతోనే క్షయ దూరం
వేపాడ : ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తే క్షయ వ్యాధిని అంతమొందించవచ్చు. క్షయ వ్యాధి మూలాలు కనుగొని 136 సంవత్సరాలు అయింది. ప్రతి ఏటా మార్చి 24న వైద్య సిబ్బంది ప్రపంచ క్షయ దినోత్సం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి జ్వరం, దగ్గు ఉన్నా.. అలాగే ఆకలి మందగించడం, బరువు తగ్గటం, దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తపు జీరలు పడినా క్షయ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. తక్షణమే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. క్షయ వ్యాధి సోకిన తర్వాత వెంటనే చికిత్స తీసుకోకపోతే అతడి నుంచి మరో 15 మంది వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులు కన్నా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ వ్యాధి భారిన పడతారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స తీసుకోవాలన్న అవగాహన రోగుల్లో ఉంటే వ్యాధిని అంతమొందించవచ్చు. మొండి క్షయ .. సకాలంలో చికిత్స పొందని పక్షంలో సాధారణ క్షయ మందులకు లొంగని మొండి క్షయ వ్యాధిగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి 4,90,000 మంది మొండి క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నూతన డ్రగ్ పాలసి క్షయ వ్యాధిగ్రస్తుల బరువు ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో మందులు వేసుకునేలా నూతన డ్రగ్ పాలసీని వైద్య సిబ్బంది నిర్ణయించారు. వ్యాధి నిర్మూలనకు ఐ.ఎన్.హెచ్ 75 ఎంజీ, రిఫామ్పిసిన్ 150 ఎంజీ, పెరిజినామిడ్ 400 ఎంజీ, ఈతాంబుటాల్ 275 ఎంజీ, స్ట్రేప్టుమైసిన్ ఇంజిక్షన్ 0.75 ఎంజీలను వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు వ్యాధి బారిన పడకుండా పుట్టిన బిడ్డ నుంచి ఏడాదిలోపు చిన్నారులకు బీసీజీ ఇంజిక్షన్ వేయించాలి. -
ఆశల దీపాన్ని కాపాడండి
వేపాడ: చెంగు..చెంగున..గెంతుతూ ఆడుతూ పాడుతూ తోటి విద్యార్థులతో చదువుకుంటున్న వయస్సులో ఓ చి న్నారిని బ్లడ్ క్యాన్సర్ మహమ్మారి పీడిస్తోంది. ఎప్పు డూ హుషారుగా ఉండే చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ సోకిన ట్లు నిర్దారణ కావడంతో తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించి వేపా డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ టి.జయశ్రీ, పాఠశాల సిబ్బంది అందించి వివరాలు ఇ లా ఉన్నాయి. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన ఎజ్జల మరియదాసు, మరియ దంపతులకు మార్తె స్వాతి వేపాడ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. 2015 జనవరిలో పండగ సెలవులకు ఇం టికి వెళ్లిన స్వాతి అనారోగ్యంతో బాధపడడంతో వైద్యులకు చూపించిన తల్లిదండ్రులు మందులతో పాఠశాలకు తీసుకొచ్చారు. మందులు అయిపోవడంతో ఫిబ్రవరి నెల మొదటివారంలో విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తామని స్వాతి తండ్రి మరియదాసు తీసుకెళ్లారు. జిల్లాకేంద్రంలో వైద్యపరీక్షల అనంతరం బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించిన వైద్యులు విశాఖ కేజీహెచ్ రిఫర్ చేశారు. కేజీహెచ్‌లో మూడురోజుల పాటు వైద్యసేవల అనంతరం వైద్యులు ఈ వ్యాధికి సంబంధించి హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లే స్థోమత లేక స్వగ్రామానికి తీసుకెళ్లిపోయా రు. అదే గ్రామానికి చెందిన పలువురు పిల్లలు వేపాడ పాఠశాలలో చదువుతున్నందున వారు పాఠశాలకు వచ్చినపుడు స్వాతికి బ్లడ్‌క్యాన్సర్ అని ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ టి.జ యశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, హౌస్ టీచర్ సునీ తలు స్వాతి స్వగ్రామం ముగడ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి తక్షణమే విశాఖ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో టెస్ట్‌లు చేసిన అనంతరం హైదరాబాద్ లోనే ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అందుతుందని వైద్యులు చెప్పడంతో ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు స్వాతిని ఫిబ్రవరి 17వ తేదీన హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ లేనందున ట్రీట్మెంట్ చేయలేమని చెప్పడంతో లక్డీకాపూల్‌లోని ఎంఎన్‌జె ఆస్పత్రిలో చేర్చారు. మార్చి17వ తేదీ వరకు ట్రీట్మెంట్ చేసి కొంత తేరుకోవడంతో డిశ్చార్జి చేశారు. తిరిగి మార్చి 25వ తేదీకి హైదరాబాద్ తీసుకొస్తే వైద్యసేవలు అందిస్తామని వైద్యులు చెప్పారు. మొదటిదఫా ట్రీట్మెంట్కు అవసరమైన ఖర్చులు, తల్లిదండ్రుల భోజనాలు, రక్తం కొనుగోలు తదితర వాటికి సుమారు రూ.75వేలు పాఠశాలనుంచి ఖర్చు చేయడంతోపాటు సిబ్బంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయితే 25వ తేదీన స్వాతిని హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిన తల్లిదండ్రులు స్థోమత లేదు. డబ్బులులేవు అని తీసుకెళ్లడంలేదంటున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. దాతలూ ఆదుకోండి చదువుకుంటున్న వయస్సులో చిన్నారి స్వాతికి వచ్చిన పెద్దకష్టానికి దాతలు సహకరించి ఆదుకోవాలని తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది కోరుతున్నారు. హైదరాబా ద్ 25వ తేదీకి చేరుకుని ఆస్పత్రిలో చేర్పిస్తే వైద్యసేవలు అందుతాయని వేడుకుంటున్నారు. సహాయం అందించే దాతలు ప్రిన్సిపాల్ టి.జయశ్రీ ఫోన్ నంబర్ 9704550021. స్వాతి తండ్రి మరియదాసు ఫోన్ నంబర్ 9652489066ను సంప్రదించవచ్చని కోరారు. స్వాతికి సహాయపడేవారు ప్రిన్సిపాల్ స్టేట్‌బ్యాంకు ఖాతా నంబర్ 33937537366లో జమచేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఎంపీటీసీలుగా భార్యాభర్తలు
వేపాడ, న్యూస్‌లైన్: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన భార్యభర్తల ఎంపీటీసీలుగా ఎన్నికయ్యా రు. సోంపు రం జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న గళ్ల శ్రీరాములునాయుడు, ఆయన భార్య దంతేశ్వరీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పాటూరు నుంచి గళ్ల దంతేశ్వరి 956 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా.. గళ్ల శ్రీరాములునాయుడు దబ్బిరాజుపేట నియోజ కవర్గంనుంచి 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధిం చారు. గతంలో పాటూరు ఎంపీటీసీగా దంతేశ్వరి ఐదేళ్ల పాటు ఎంపీపీగా పని చేశారు.