ఖాజీపేట, న్యూస్‌లైన్: తిరుపతిలో ఉంటూ వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి రోడ్డు ప్రమాద ంలో మృతిచెందింది. మండల పరిధిలోని రావులపల్లెకు చెందిన పోలు సుబ్బారెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. సుబ్బారెడ్డి పోలీసుశాఖలో తిరుమలలో ఉద్యోగం చేస్తూ అక్కడే భార్య బిడ్డలతో కాపురం ఉంటున్నాడు. వేసవి కాలం రావడంతో కూతురు భవ్యశ్రీ(4) అమ్మమ్మగారి ఊరైన వల్లూరు మండలం చెరువుకిందపల్లె వచ్చింది.
బుధవారం మండల పరిధిలోని కొత్తపేటలో బంధువుల వివాహం జరుగుతుండగా అమ్మమ్మతో కలిసి వివాహ వేడుకలకు వచ్చింది. అక్కడి నుంచి రావులపల్లెలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లాలని కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉండగా ఐషర్ వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. మనువరాలు తన క ళ్ల ముందు మృతి చెండడంతో ఆమె బాధ వర్ణనాతీతమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని విలపిస్తుండటంతో రావులపల్లె వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
తప్పెట్ల సమీపంలో...
వల్లూరు: వల్లూరు మండలంలోని తప్పెట్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్ఞానమయ్య(65) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కాశినాయన మండలం ఇటుకలపల్లెకు చెందిన జ్ఞానమయ్య వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేటలో వున్న తన కుమార్తె వద్ద గత కొంతకాలంగా వుంటున్నాడు. ఉదయం తప్పెట్ల బస్టాపు వద్ద గల కల్వర్టుపై కూర్చుని వుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇతడు మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
Published Thu, May 22 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement