వేముల : మండలంలోని గొందిపల్లె గ్రామంలో శుక్రవారం సాయంత్రం చిన్నారి నందిని (3) స్కూలు వ్యాను కిందపడి మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని నాగభూషణం తన చిన్నారి నందిని మలవిసర్జన కోసం రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. చిన్నారికి కాపలాగా అక్కడే ఉన్నాడు. అదే సమయంలో వేంపల్లెకు చెందిన వివేకానంద స్కూలు వ్యాను పిల్లలను ఎక్కించుకొని గొందిపల్లెకు వచ్చింది. అక్కడ చిన్నారి తండ్రి ఉండటం డ్రైవర్ గమనించాడు.
స్కూలు వ్యాను డ్రైవర్ పిల్లలను దించారు. అక్కడే తిప్పుకొని తిరిగి వెళుతున్న సమయంలో చిన్నారి తండ్రి లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లారని డ్రైవర్ బస్సును కదిలిచ్చారు. అయితే చిన్నారి తండ్రికి ఫోన్ రావడంతో రోడ్డు అటువైపు వెళ్లగా.. తండ్రి కోసం చిన్నారి కూడా వెళుతుండటం డ్రైవర్ గమనించలేదు. దీంతో స్కూలు బస్సు చిన్నారి తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రి నాగభూషణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్ తెలిపారు.
రోదించిన తల్లిదండ్రులు :
స్కూలు బస్సు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బస్సు చిన్నారి తలపై వెళ్లడంతో చూసేందుకు హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన తెలిసి గ్రామస్తులంతా అక్కడ చేరుకుని చిన్నారి మృతిని చూసి చలించిపోయారు.
స్కూలు వ్యాను కిందపడి చిన్నారి మృతి
Published Sat, Sep 6 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement