హన్వాడ, న్యూస్‌లైన్: ఆడిపాడే వయసులో ఆ బాలుడికి ఆపదొచ్చింది. విధి వెక్కిరించడం తో ఉన్నట్టుండి కడుపులో క్యాన్సర్ గడ్డలు పుట్టుకొచ్చాయి. రెక్కాడితే డొ క్కాడని ఆ పేద తల్లిదండ్రులు ఒక్కగానొక కొడుకును కాపాడుకునేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు. వైద్యానికి మరింత డబ్బు కావాలని వైద్యులు సూచించడంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచక తల్లడిల్లిపోతున్నారు. మండలంలోని కొత్తపేట పిల్లిగుండు తండాకు చెందిన విస్లావత్ శంకర్ నాయక్, బుజ్జిబాయిలకు నలుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు కాగా, రెండోవాడైన కైలాష్ ఉన్నట్టుండి క్యాన్సర్ వ్యాధి బారినపడ్డాడు. ఏడాది కాలంగా కొడుకును బతికించుకునేందుకు తల్లిదండ్రులుచేయని ప్రయత్నం లేదు. తండాలో ప్రస్తుతం నివాసం ఉం టు న్న ఇల్లుతో పాటు ఉన్న ఎకరా పొలాన్ని కూడా అమ్మి కొడుకు వైద్యం కోసం వెచ్చించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్యచికిత్సలు పొందుతున్న కైలాష్ బతకాలంటే ఇంకా* 3.50లక్షలు అవసరమని అక్కడి వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వలేని ఆ తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కాయకష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలను, ఓ కొడుకుని చదివిస్తున్న తమకు ఎలాంటి ఆదాయవనరులు లేవని, ఒక్కగానొక్క కొడుకును క్యాన్సర్ బారి నుంచి కాపాడుకునేందుకు ఆదుకోవాలని ఆర్థికసాయం చేయాలని శంకర్ నాయక్ దాతలను వేడుకుంటున్నా డు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 90523 56361, 97037 53633.
మృత్యువుతో పోరాటం
Published Tue, Aug 20 2013 6:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement