
కౌన్సెలింగ్ ఇస్తున్న అధికారులు
కవిటి: మండలంలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం కళింగపట్నంలో మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నాన్ని ఇచ్ఛాపురం ప్రాంతీయ గెస్ట్ చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ... కళింగపట్నంలో 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయికి వివాహం చేయాలని ఇంటి పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు 1098కు అందిన సమాచారం మేరకు చైల్డ్‌లైన్ ప్రతినిధి ప్రసాద్‌బిసాయి అక్కడకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టి అమ్మాయి వయస్సును నిర్ధారించుకున్నారు.
అనంతరం వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ శాఖలకు సంబంధించిన అధికారులతో బాల్య వివాహానికి సిద్ధమవుతున్న వారి ఇంటికి వెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి వివాహాలను ప్రోత్సహిస్తే బాల్య వివాహాల నిరోధక చట్టానికి లోబడి ఇరువర్గాల కుటుంబాలకు కఠిన శిక్షలు పడతాయని వివరించారు.దీంతో ఇరువర్గాల వారు తమ ప్రయత్నాన్ని విరమించుకొంటున్నామని లిఖిత పూర్వకంగా అంగీకరించారు. కార్యక్రమంలో వీఆర్‌ఓ కూర్మనాయకులు, పంచాయతీ కార్యదర్శి విజయకుమార్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సీహెచ్ నాగలక్ష్మీ, పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment