కాట్రేనికోన : అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేస్తున్నట్టు మహిళా శిశు సంజీవిని మిషన్ (యూనిసెఫ్) జిల్లా కోఆర్డినేటర్, కలెక్టర్ భార్య శ్రీదేవి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు సంజీవిని మిషన్ సభ్యుల బృం దం శనివారం దొంతికుర్రు పెదచెరువుపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. బృం దాలుగా ఏర్పడి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆట వస్తువులు తదితర అంశాలను పరిశీలించారు. మరికొన్ని బృందాలు గ్రామంలో పర్యటించి సర్వే చేపట్టారు.
అంగన్‌వాడీ కే ంద్రం గాలి వెలుతురు లేకుండా ఇరుకుగా ఉన్నాయి. పరిసరాలలో నీటి గుంత ఉండటంతో దోమలు పెరిగే పరిస్థితి ఉన్నట్టు గుర్తించారు. నీటిగుంత పూడ్చివేసేందుకు సహకరించాలని సర్పంచ్ పెయ్యల సత్యనారాయణను కోరారు. అనంతరం కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన దత్తత అంగన్‌వాడీ కేంద్రంలో బృంద సభ్యు లు పరిశీలించిన అంశాలను సమావేశంలో చర్చించారు. శ్రీదేవి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ,మహిళా శిశు సంజీవిని మిషన్ జిల్లా 11 సీడీపీఓల పరిధిలోని 50 కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నామన్నారు.
ఆయా అంగన్‌వాడీ కేంద్రాలలో సమస్యలు, పిల్లల పౌష్టికాహారం తదితర అంశాలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ కనకలింగేశ్వరరావు, కాకినాడ, తుని, సామర్లకోట సీడీపీఓలు సావిత్రి, మాధవి, శారద సంపత్‌కుమారి, యూనిసెప్ ప్రతినిధులు కె.దుర్గాప్రసాద్, ఎం.గణేష్ తదితరులు ఉన్నారు.
బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషి
Published Sun, Apr 24 2016 3:05 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement