పెండ్లిమర్రి : ‘ఎం.ఏరాసుపల్లె గ్రామంలో దాదాపు నెల రోజుల నుంచి విషజ్వరాలు వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయారు. ఇలానే కోనసాగితే గ్రామస్తులు ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్లుంది. గ్రామస్తులు భయం గుప్పిట్లో ఉన్నారు. పరిస్థితి ఆలాగుంటే మీరేం చేస్తున్నార’ని వైద్యాధికారులపై ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఏరాసుపల్లె గ్రామంలో శుక్రవారం డెంగీ లక్షణాలతో నరసింహరెడ్డి(14) అనే బాలుడు మృతి చెందాడు.
విష జ్వరాలతో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఫ్రగాడ సానూభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. గ్రామస్తులు భయంతో వణికి పోతున్నారని, జ్వరాలు రాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని డీఎంహెచ్‌ఓ నారాయణ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొత్తగా జ్వరం కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో పాడుబడిన బావిని పూడ్చివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పసల భాస్కర్, ఎంపిపి భర్త రామమోహన్‌రెడ్డి, రైతు కన్వీనర్ నాగమల్లారెడ్డి, ఎంపీడీవో వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ అంజనేయులు, వైద్యాధికారి మధుసూదన్‌రెడ్డి, ఈఓపిఆర్డి రఘనాధ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, డెంగీ లక్షణాలతో చనిపోయిన నరసింహారెడ్డి మృతదేహాన్ని టీడీపీ నియోకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహరెడ్డి పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు ఫ్రగాడ సానూభూతి తెలిపారు.
పిల్లలిలా చనిపోతుంటే ఏం చేస్తున్నారు?
Published Sat, Mar 7 2015 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement