
స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్‌ఫర్నీస్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చైనా ప్రతినిధుల బృందం
సాక్షి, జమ్మలమడుగు/ కడప: మండల పరిధిలోని అంబవరం పంచాయతీ చిటిమిటి చింతల గ్రామ సమీపం వద్ద నిర్మిస్తూ ఆగిపోయిన స్టీల్‌ప్లాంట్‌ను చైనాకు చెందిన ధియాంగ్ హోల్డింగ్స్ కంపెనీకి చెందిన నలుగురు ప్రతినిధులు పరిశీలించారు. శుక్రవారం కడపకు చెందిన పరిశ్రమల అధికారులు, ఆర్డీఓ వి.నాగన్న, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డిలతో కలసి క్షేత్రస్థాయిలో జరిగిన పనులను పరిశీలించారు.
భూముల వివరాలను తెలుసుకున్న ప్రతినిధులు..
స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కొప్పర్తి ప్రాంతాన్ని పరిశీలించిన చైనా ధియాంగ్ హోల్డింగ్స్ కంపెనీ ప్రతినిధులు నేరుగా ఆర్డీఓ ఛాంబర్‌లో ఉన్న ఆర్డీఓ నాగన్నను కలిశారు. ఈసందర్భంగా స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన భూముల వివరాలను, ప్లాంట్‌కు కావలసిన నీరు, ముడిసరుకు వివరాలతోపాటు, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, జాతీయ రహదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment