నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: మహిళలను లక్షాధికారులు చేయాలనే వైఎస్సార్ ఆశయానికి కొందరి ధనదాహం, నిర్లక్ష్యం తూట్లు పొడుస్తున్నాయి. లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రుణాలను కొం దరు అవినీతిపరులు స్వాహా చేస్తుండటంతో లక్ష్యం పక్కదారి పడుతోంది.
కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయి. నిరుపేద మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నిధులు జిల్లాలోని పలు మండలాల్లో స్వాహా అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కలువాయి మండలం పెన్నబద్దెవోలులో గతంలో సీఎఫ్(క్లస్టర్ ఫెసిలిటేటర్)గా పనిచేసిన వ్యక్తి రూ.70 వేలు స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రామసంఘం అధ్యక్షురాలితో కలిసి ఆయన స్వాహా పర్వానికి తెరదీసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాలోని అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఓ వైపు నిధులు స్వాహా అవుతున్నా, మరోవైపు ఉన్నాయి. నిబంధనల ప్రకారం రుణాలకు సంబంధించి వసూలైన మొత్తాలను ఆఫీస్ బేరర్లు బ్యాంకులో జమ చేయాలి. ఇది ప్రహసనంగా మారింది.
చిన్నగోపవరం, బ్రాహ్మణపల్లిలో సుమారు రూ.1.20 లక్షలు స్వాహా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుణాలు పొందిన అనేక మంది మహిళలు తాము చెల్లించినట్టే భావిస్తున్నారు. అవి బ్యాంకులో జమకాకపోతుండటంతో వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు మంజూరు కావడం లేదు. విషయం తెలియని మహిళలు రుణాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
2004లో మంజూరైన సీఐఎఫ్ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత వడ్డీ వచ్చిందో తదితర వివరాలు అధికారుల వద్ద లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 పైసలు చొప్పున వడ్డీ లెక్కగట్టినా నెలకు రూ.20 లక్షలు రావాలి. ఈ క్రమంలో ఏడాదికి రూ.2 కోట్లు జిల్లా, మండల సమాఖ్య ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు రూ.16 కోట్లకు పైగా ఆదాయం ఎంఎస్‌లకు లభించి ఉండాలి. వడ్డీ వసూలు, ఖర్చు తదితర వివరాలు అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సీఐఎఫ్ నిధుల స్వాహా !
Published Wed, Sep 18 2013 4:18 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement