జనరల్ స్టోర్స్‌పై సివిల్ సఫ్లై అధికారులు దాడిచేసి నాలుగు లక్షల విలువైన పప్పు ధాన్యాలను సీజ్ చేశారు
జనరల్ స్టోర్స్‌పై సివిల్ సఫ్లై అధికారులు దాడిచేసి నాలుగు లక్షల విలువైన పప్పు ధాన్యాలను సీజ్ చేశారు. ఈ సంఘటన ఏలూరులోని బెనర్జీపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. బెనర్జీపేటకు చెందిన సాంబశివ జనరల్ స్టోర్‌లో అక్రమంగా పప్పు దాన్యాలు నిలువ ఉంచారనే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో షాప్‌పై దాడిచేసి నాలుగు లక్షల విలువ చేసే పప్పు ధాన్యాలను అధికారులు సీజ్ చేశారు.