స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాటం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: స్త్రీ, పురుష సమానత్వం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ, శిశు సంక్షేమశాఖ విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఒక అసెస్‌మెంట్ చేసింది. 2186 నాటికి స్త్రీ పురుష సమానత్వం వస్తుందని తేల్చింది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. వీలైనంత తొందరలో సమానత్వం వచ్చేంతవరకు పోరాడాలి’ అని చెప్పారు. ఆల్ ఇండియా లెవెల్‌లో ఫైనాన్స్ మినిష్టర్ కూడా సరిగా పనిచేయలేరేమోగానీ ఇంట్లో ఫైనాన్స్ గురించి మహిళలు ఎంతో చక్కగా చూసుకుంటారని పేర్కొన్నారు. పబ్లిక్ రిలేషన్స్‌లో కూడా వారు మెరుగ్గా ఉంటారన్నారు.