పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం | CM Chandrababu Naidu Participates In Christmas Celebrations At Guntur district | Sakshi
Sakshi News home page

పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం

Published Mon, Dec 26 2016 1:26 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం - Sakshi

పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం

పెదకాకాని: పేదవాళ్లు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని సీఎం ఎన్‌. చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని స్వస్థిశాలలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెదకాకాని స్వస్థిశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఇక్కడ మంచి సందేశంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడమే నిజమైన సేవన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మదర్‌ థెరిస్సా, సిస్టర్‌ నిర్మల చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాలని క్రిస్మస్‌ కానుక అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. క్రిస్టియన్‌ సంక్షేమం కోసం రూ.57 కోట్లు  కేటాయించామన్నారు. బెత్లెహోం వెళ్లేవారికోసం ప్రస్తుతమిచ్చే రూ.20 వేలను రూ.40 వేలకు పెంచినట్టు ప్రకటించారు. అలాగే చర్చి నిర్మించుకునే వారికిస్తున్న రూ.లక్షను రూ.3 లక్షలకు పెంచినట్టు తెలిపారు. అందరూ శాంతి, దయ, ఆప్యాయత కలిగి ఉండాలని సూచించారు. ఆ యేసుప్రభువు ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నారు. ‘యెహోవా నేను బ్రతికియుండు దినములన్నియు కృపాక్షేమములే’’ అని బైబిల్‌ వాక్యాన్ని ఆయనీ సందర్భంగా భక్తులకు చదివి వినిపించారు.

తిరుపతిలో 99వ ఆర్థిక సంఘం సదస్సు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జాతీయ స్థాయిలో జరిగే 99వ భారత ఆర్థిక సంఘం (ఐఈఏ)వార్షిక సదస్సులకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు శ్రీవేంకటేశ్వర వర్సిటీలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో ఈ సదస్సులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి  చంద్రబాబు, అంతర్జాతీయ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కౌశిక్‌బసు ఈ సదస్సులను ప్రారంభించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement