సాక్షి, అమరావతి : కరోనావైరస్ (కోవిడ్-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు.
(చదవండి : ఏపీలో మరో కరోనా కేసు నమోదు..)
కాగా, ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. నేటి నుంచి విద్యా సంస్థలను బంద్ చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి సమాచారాన్ని ముందే సేకరించి, ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరి బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment