
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదార్ఘ కాలంపాటు సీఎం జగన్ ఆరోగ్య వంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు ఆయన రాష్ట్రానికి సీఎంగా ఉండాలని, చరిత్రలో ఏ నాయకుడు చేయని పాదయాత్ర సీఎం జగన్ చేశారని వ్యాఖ్యానించారు.
రెండు కోట్ల మంది ప్రజలను స్వయంగా కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారని, ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ అమలు చేశారని అన్నారు. చట్టాలను అమలు చేయడంలో దేశానికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ది అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలనే మూడు ప్రాంతాల్ల రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాడని పేర్కొన్నారు. రాజధానుల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment