Ummareddi Venkatesvarlu
-
ప్రజాసంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు
-
దేశానికే సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదార్ఘ కాలంపాటు సీఎం జగన్ ఆరోగ్య వంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు ఆయన రాష్ట్రానికి సీఎంగా ఉండాలని, చరిత్రలో ఏ నాయకుడు చేయని పాదయాత్ర సీఎం జగన్ చేశారని వ్యాఖ్యానించారు. రెండు కోట్ల మంది ప్రజలను స్వయంగా కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారని, ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ అమలు చేశారని అన్నారు. చట్టాలను అమలు చేయడంలో దేశానికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ది అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలనే మూడు ప్రాంతాల్ల రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాడని పేర్కొన్నారు. రాజధానుల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. -
గ్రామ సచివాలయం నుంచే పరిపాలన
సాక్షి, గుంటూరు: తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఒకటి.. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో దేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం లభించిగా.. రెండు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయనున్నారని తెలిపారు. రెండున్నర నెలల పాలనలో సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి: గట్టు శ్రీకాంత్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకొని యావత్తు దేశం తమ వైపు చూసే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు. -
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, లక్ష్మీపార్వతి, జంగా కృష్ణమూర్తి, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా 12, మార్చి 2011న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘విజయవంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. జనహృదయ నేత రాజన్న సిద్ధాంతాలను కొనసాగించాలనే ధ్యేయంతోనే యువజన శ్రామిక రైతు పార్టీ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యాం. అయినా, అది ఓటమిగా భావించడం లేదు. ఈ ఐదేళ్ల టీడీపీ నిరంకుశ పాలనలో ఎన్నో అక్రమాలు చోటు జరిగాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాగే శర్మిలమ్మ పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. 14 నెలల సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టి 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఎన్నో గొప్ప ఆశయాలు గల మన పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయి. ఆయనకు ఓసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. ప్రజల పక్షాన నిలిచిన పార్టీ.. విజయవాడ: పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ నగర వర్కింగ్ ప్రెసెడెంట్ మల్లాది విష్ణు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, నాగిరెడ్డి, గౌతంరెడ్డి, ఆసీఫ్, తోట శ్రీనివాస్, మహబూబ్, ఎంవీఆర్ చౌదరి, పుల్లారావు, గౌస్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ... ‘ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పాటుపడుతోంది. ప్రజల పక్షాన నిలిచిన రాజకీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. రాజన్న పాలన మళ్లీ అందించాలంటే అది ఒక్క వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం. వైఎస్సార్ అకాల మరణం తర్వాత ప్రజల ఆవేదన నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా.. వాటిని తట్టుకుని మన పార్టీ ముందుకు సాగుతున్నది’ అన్నారు. చంద్రబాబు నరకాసుర పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలివేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించినప్పుడు అపహస్యం చేశారని, కాని నేడు వాటినే చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతి పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడనున్నారని జోస్యం చెప్పారు. వైయస్సార్ జిల్లా: రాజంపేటలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటీ అమరనాథ్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా: జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సుధీర్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. (ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు : వైఎస్ జగన్) -
మరి చంద్రబాబు చేసిందేమిటి ?
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక,అవినీతి పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 30 యాక్టు,144 సెక్షన్ల ఎందుకు విధించారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటు కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు హాజరయ్యారు. టీడీపీ పాలనపై ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. అప్పుడు కిరణ్.. ఇప్పుడు బాబు: పెద్దిరెడ్డి ‘ఎవరితోనైనా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడానికి వెనకాడడు. గతంలో 600 హామీలు ఇచ్చారు. నాలుగున్నర సంవత్సరాల్లో విపరీతంగా అప్పులు చేశారు. ఏ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేదు. కేంద్రం నిర్మిస్తానన్న పోలవరం, చంద్రబాబు తన సొంత వ్యక్తులకు కట్టబెట్టుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కన్నా సొంత విషయాలపై శ్రద్ధ. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఒకరేమో 16 నెలలు జైల్లో పెట్టిస్తే, మరొకరు చంపే యత్నం చేశారు. ఇద్దరు ఈ జిల్లా వాళ్లే కావడం ఇబ్బందికరంగా ఉంద’ని పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జగనన్నకు మహిళాదరణ: రోజా ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలకు గౌరవం ఇస్తోంది. ఎన్నో సమస్యలపై పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలు ఎంత ఆదరణ ఇస్తున్నారో పాదయాత్ర ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. ఎప్పుడూ చంద్రబాబు ఒంటిరిగా పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని బాబు ప్రయత్నం చేశారు. కేసులున్న క్రిమినల్ని ఎలా ఎయిర్‌పోర్టు రెస్టారెంట్లో పెట్టుకున్నారు. దాడి తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌పై ఏవిధంగా టీడీపీ నాయకులు మాటల దాడి చేశారో అందరూ చూశార’ని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బాబూ.. ఇప్పుడేమంటావ్: బొత్స ‘రాజకీయ చైతన్యమున్న జిల్లా చిత్తూరు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ఆర్ ఎంతమేరకు అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలకు తెలుసు. టీడీపీ నాయకులపై ఐటీ దాడులు చేస్తేనే బాబుకు దేశం గుర్తుకు వచ్చింది. రామాయపట్నం పోర్టు ప్రైవేట్ వారికి కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నా మాట మీదే జరిగిందన్నావు. మరి ఇప్పుడు ఏమంటారో చెప్పాల’ని చంద్రబాబు నుద్దేశించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. క్లిష్టంగా చంద్రబాబు పరిస్థితి: ఉమ్మారెడ్డి ‘మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు చాలా రాష్ట్రాలు వెళ్లి వస్తున్నారు. వారందరూ నాలుగేళ్లుగా మోదీకీ వ్యతిరేకంగా పోరాడుతున్నవారే. కొత్తగా మీరు కూడగట్టిన నాయకులెవరూ లేరు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. మరి చంద్రబాబు చేసిందేమిటి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందెవరు. రాజ్యాంగం కన్నా నీ పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లుంది. అసెంబ్లీ చరిత్రలోనే ఎక్కడా లేదు ఒక మహిళను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కినట్లుగా ఉందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. టీడీపీ పాలనలో జిల్లాలో పలు పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. మోదీ చర్యలకు భయపడి అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. కేవలం ఐటీ నోటీసులకే దేశంలోని అందరి కాళ్లు చంద్రబాబు పట్టుకుంటున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంటింటి సర్వే పేరుతో మోసాలు చేస్తూ, ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. -
రేపటి నుంచే ‘కావాలి జగన్..రావాలి జగన్’
సాక్షి, గుంటూరు : నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సోమవారం నుంచి ‘ కావాలి జగన్..రావాలి జగన్’ అనే కార్యక్రమాన్ని175 నియోజక వర్గాల్లో చేపడుతున్నామని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి సమన్వయ కర్త ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను జనంలోకి తీసుకెళ్తూ వాటి ద్వారా చేకూరే లబ్ధిని తెలియజేయాలన్నారు. అధికారం పోతుందని తెలిసే టీడీపీ నేతలు అవినీతి, దోపీడీలకు పాల్పడుతున్నారని బొత్స విమర్శించారు. చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని పాలించడం వదిలేసి దోచుకోవడమే పరమావధిగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. బాబు దోపిడీలను ప్రజలకు వివరిస్తూనే అధికారంలోకి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలి : ఉమ్మారెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. మరీ ముఖ్యంగా బూత్ కమిటీ సభ్యులు అలర్ట్‌గా ఉండాలన్నారు. పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే న్యాయం జరుగుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. నవరత్నాల వల్ల కలిగే లబ్దిని జనాలకు వివరించాలని పార్టీ సభ్యులకు సూచించారు. -
జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం
ఆయన వెంటే జనం ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గాజువాక, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజలు ఆయన వెంటే ఉన్నారని, యువకులు, మహిళలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. గాజువాక దరి శ్రీనగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత పరిపాలన మహిళలకు అప్పగించనున్నారన్నారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రారంభించి పది మంది చొప్పున మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 20 వేల మంది మహిళలకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయన్నారు. బీసీల రిజర్వేషన్లలో ఎలాంటి కోత లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బీసీ కోటా పెంచి కాపులను కూడా బీసీల్లో చేర్చేందుకు జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారన్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు మాటలు తప్ప కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ఎన్నివేల కోట్లు ఖర్చు చేసైనా విశాఖ జిల్లాను కాలుష్య రహితంగా అభివృద్ధి చేసేందుకు జగన్ మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. దీని కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా విజయమ్మ, ఎమ్మెల్యేగా నాగిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 61వ వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు సిద్ధా సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు భూపతిరాజు శ్రీనివాసరాజు, నాయకులు గొంతిన వెంకట రమణ, టి.వి.వి.దొరబాబు, వారణాసి దినేష్‌రాజు, రాజాన రామారావు, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, కటికల కల్పన, వర్మ తదితరులు పాల్గొన్నారు.