
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిన్నారిపై అమానుష ఘటన తీవ్రంగా కలచివేసిందని సీఎం అన్నారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాఉండగా.. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు.
(చదవండి : లైంగికదాడి.. హత్య!)
Comments
Please login to add a commentAdd a comment