ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ దొంగలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగింస్తూ... సీఎం కిరణ్ సమైక్యవాది అయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకుండా తిరుగుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులను అడ్డుకుని బుద్ది చెప్పాలని భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.