సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు 2014లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, దానిని అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్‌ను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అడిగారా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. హోదాను అమలు చేయాలని కనీసం ప్లానింగ్ కమిషన్‌కు లేఖ కూడా రాయలేదని గుర్తుచేశారు. హోదా తీర్మానంపై చంద‍్రబాబు నాయుడు మాట్లాడిన అనంతరం.. సీఎం వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు కనీసం చిత్తశుద్ధి కూడా లేదని సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఏర్పడిన తొమ్మిది నెలల తరవాత చంద్రబాబు స్పందించారని, అప్పటి వరకు కనీసం దాని ఊసే లేదని గుర్తుచేశారు. దీన్ని బట్టే చూస్తే.. హోదాపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని సీఎం వైఎస్ జగన్ వివరించారు. పోలవరం నిర్మాణం కొరకు ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఇవ్వకపోతే ప్రమాణం చేయమని అప్పట్లో చంద్రబాబు చెప్పారని, మరి హోదా ఏం పాపం చేసిందని.. ఆ పని చేయలేదని ఘాటుగా నిలదీశారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబాద్ధాలు మాట్లాడుతన్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment