కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, వేదికపై ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అనంతపురం : అనంతపురం వేదికగా ఈ నెల పదో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం, బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలకు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. ప్రతికార్యకర్తకూ అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ ప్రజలకు చేరవేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కంటి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించి, దానిని నివారించేందుకు ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి, అవసరమైన శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు అందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శ సీఎంగా నిలుస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డిని కొనియాడారు.
విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు
ఐదేళ్ల పాలనలో పనులను అసంపూర్తిగా చేపట్టి.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని అనంత పేర్కొన్నారు. కమీషన్ల కోసం పనుల వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచి ప్రభుత్వ నిధులను దోచుకున్న టీడీపీ నేతలకు వైఎస్సార్‌సీపీ పాలన గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. అనంతను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి పనులు చేస్తున్నామన్నారు.
పండుగలా సీఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన జిల్లాకు పండుగలాంటిదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు అద్యక్షులు నదీం అహమ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరుశురాం, మహాలక్ష్మిశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు వై మధుసూదన్‌రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై.వి.శివారెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, సీనియర్ నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. సీఎం హోదాలో జిల్లాకు తొలిసారి వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ విజయవంతానికి అందరి తోడ్పాటు అవసరమన్నారు. ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా తొలివిడత 90 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను చేయించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు చేసి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బోయ గిరిజమ్మ, జానకి, వాసంతి సాహిత్య, కృష్ణవేణి, శ్రీదేవి, మన్సూర్, కొర్రపాడు హుస్సేన్‌పీరా, చింతకుంట మధు, రిలాక్స్ నాగరాజు, ఏకేఎస్ ఫయాజ్, మునీరాబేగం, ఉమామహేశ్వరి, సాకే చంద్ర, దుర్గేష్, నజీర్‌అహమ్మద్, బాలాంజినేయులు, కాగజ్‌ఘర్ రిజ్వాన్, రియాజ్, బాలకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్, శోభ, ఉష, ఖాజా, నియాజ్, రాజేష్‌రెడ్డి, రియాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, గోగుల పుల్లయ్య, వడ్డే గోపాల్, కుళ్లాయిస్వామి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
10న విద్యార్థులతో సీఎం ముఖాముఖి
అనంతపురం అర్బన్: ‘‘వైఎస్సార్ కంటి వెలుగు’ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10న అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్కడే బహిరంగసభలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి’ అని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ. చిత్రంలో జేసీ, జేసీ–2, కమిషనర్
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. కంటి వెలుగుకు సంబంధించి మూడు స్టాళ్లతో పాటు నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, పోషణ్ అభియాన్, అమ్మ ఒడి స్టాళను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కార్యక్రమం ప్రారంభోత్సవానికి తీసుకుంటున్న చర్యలను డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్ వివరించారు. విద్యార్థులను బహిరంగసభకు తీసుకొచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఈఓ, సంక్షేమ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇఇదిలా ఉండగా సీఎం బహిరంగ సభకు సంబంధించి కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment