
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాకారం కావాలని సీఎం జగన్ కోరినట్లు సమాచారం. కాగా రెండు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ప్రధానిని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సంబంధిత మంత్రులను కూడా సీఎం జగన్ కలువనున్నారు. రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.