సాక్షి, అమరావతి: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష
ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ పలు ముఖ్య సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
నేడే ‘నవోదయం’
Comments
Please login to add a commentAdd a comment