రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి రెడ్డి
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సతీమణి వైఎస్ భారతితో కలసి రాజ్‌భవన్‌కు చేరుకున్న వైఎస్ జగన్.. గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్‌కు సీఎం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విశదీకరించారు. శాసనసభ ఆమోదించిన ‘దిశ’ చట్టం గురించి వివరించారు. గవర్నర్ దంపతులను ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి సన్మానించి మెమొంటో అందించారు. గవర్నర్ కూడా సీఎం దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శులు అర్జునరావు, నాగమణి, జీఏడీ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment