
సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం
విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారెడ్డి
అనంతపురం అర్బన్:సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించుకుందామని వైఎస్సార్‌సీపీకి అనుబంధంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన సంఘ జిల్లా స్థారుు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తామని చెప్పారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకుల నుంచి వేతనాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ 10 శాతం ఐఆర్ వచ్చేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగులు కష్టాలు తెలిసినందున వాటిని తీర్చేందుకు పాటుపడతామని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైన ఫాలోఅప్‌కు చేయడానికి తిరుపతిలో ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడానికి కార్మికులంతా పాటుపడాలని కోరారు.
సంఘ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఏపీఎస్‌పీడీ సీఎల్ అధ్యక్షుడు ఆర్.రమేష్‌బాబు, ఏపీఎస్‌పీడీసీఎల్ డిస్కం కార్యదర్శి బి.బాలాజీ, రాష్ట్ర అధికారి ఎస్.మహబూబ్ బాషా తదితరులు మాట్లాడారు.
వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల నూతన జిల్లా కమిటీ ఇదే...
వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘం విద్యుత్ ఉద్యోగుల సంఘ నూతన కమిటీకి ఎన్నికలు జరిగాయి. రీజినల్ అధ్యక్షుడిగా టి.వి.రామ్‌సుదర్శన్(యూడీసీ, ఈఆర్‌ఓ అనంతపురం), కార్యదర్శిగా ఎం.అబ్దుల్ ఖాదర్ బాషా(యూడీసీ డివిజన్ ఆఫీసు అనంతపురం), వర్కింగ్ అధ్యక్షుడిగా జి.రామకృష్ణ(లైన్‌మన్ ఉరవకొండ), అదనపు కార్యదర్శిగా వి.ఎం.విన్సంట్ కుమార్(యూడీసీ గుంతకల్లు), కోశాధికారిగా జి.విక్టర్ విజయ్‌కుమార్(లైన్‌యన్ అనంతపురం), అడ్వైజర్‌గా కొర్రపాడు హుస్సేన్ పీరా(అనంతపురం) ఎన్నికయ్యూరు.
ఈ కమిటీతో పాటు అనంతపురం అపరేషన్ డివిజన్ కార్యకవర్గాన్ని ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షుడిగా ఎ.ఖాదర్ బాషా, కార్యదర్శిగా ఇ.గురుస్వామి, వర్కింగ్ అధ్యక్షుడిగా డి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా బి.నాగరాజు, కోశాధికారిగా బి.రాజశేఖర్ ఎంపికయ్యూరు. కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం, ఎంఆర్ డివిజన్లకు సంబంధించిన ప్యానల్ ఎన్నికలను వారంలోగా నియమించనున్నారు.