coordination
-
అప్రమత్తంగా ఉందాం... కాపాడుకుందాం
‘‘సైబర్ నేరస్తులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండి, మనల్ని మనం కాపాడుకోవాలి’’ అంటున్నారు రష్మికా మందన్నా. గత నవంబరులో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్–ఇండియన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ శరీరానికి రష్మికా ముఖాన్ని పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియో రష్మికతో పాటు చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత కూడా పలువురు తారల ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి.కాగా, తన గురించి వచ్చిన డీప్‌ఫేక్ వీడియో గురించి స్పందిస్తూ... ‘‘నేను స్కూల్లో, లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని ఉండగలనా? అని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని రష్మిక అప్పట్లో ట్వీట్ చేశారు. అలాగే ‘‘అందరం కలిసి ఈ ధోరణికొక విరుగుడు కనిపెడదాం’’ అని మహిళలకు పిలుపునిచ్చారు కూడా. ఇప్పుడా పిలుపునకు ఒక సాధికారత లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సి)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం రష్మికా మందన్నాని నియమించింది. కేంద్ర హోమ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ కో ఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. రష్మికా మందన్నాని రాయబారిగా ఎంపిక చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సైబర్ సేఫ్టీ జాతీయ ప్రచారోద్యమ రాయబారిగా తాను నియమితమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పేర్కొని, ఓ వీడియో విడుదల చేశారు రష్మిక. ఆ వీడియోలో ‘‘మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. సైబర్ క్రైమ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. దాని ప్రభావం ఎంత ఉంటుందో స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మన ఆన్లైన్ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మనందరం కలిసి మన కోసం, భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన సైబర్ స్పేస్‌ని రూపొందించుకుందాం. సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువమందికి అవగాహన కల్పించి, రక్షించాలని అనుకుంటున్నాను.సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక దాదాపు ఏడాది క్రితం (నవంబరు 6) రష్మిక సైబర్ క్రైమ్ బాధితురాలు... ఏడాది తిరక్క ముందే ప్రజల్ని బాధితులు కానివ్వకుండా జాగృతం చేయనున్న సైబర్ యోధురాలు. ఇదిలా ఉంటే... కెరీర్ పరంగా ‘దేవదాస్’ (2018) చిత్రంలో ఇన్స్పెక్టర్ పూజగా నటించారు‡రష్మిక. తెరపై తన బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేశారు. ఇప్పుడు నిజ జీవితంలో సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌గా తన బాధ్యతను చాలా సిన్సియర్‌గా నిర్వర్తించాలని బలంగా నిర్ణయించుకున్నారు. -
పార్లమెంట్లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు
కోల్‌కతా: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో సమన్వయం చేసుకోవడంపై తమకు ఆసక్తి లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇతర పక్షాలకు సహకారం అందిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న నిర్వహించనున్న ప్రతిపక్షాల భేటీకి తాము హాజరుకాబోమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు శనివారం చెప్పారు. కాంగ్రెస్ ముందు అంతర్గతంగా సమన్వయం చేసుకోవాలని, సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ తర్వాతే ఇతర పార్టీలతో సమన్వయంపై ఆలోచించాలని సూచించారు. అధికార బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ నేతల్లో అంకితభావం కనిపించడం లేదని తప్పుపట్టారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అసమర్థ పార్టీ అని తృణమూల్ ఆరోపిస్తోంది. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శిస్తోంది. -
ఇటు ఉద్యోగం.. అటు కుటుంబం.. కష్టమే!
ముంబై: ఇటు ఉద్యోగం.. అటు కుటుంబం .. రెండింటి మధ్య సమన్వయం, సమతౌల్యత సాధించడం కష్టంగానే ఉంటోందని దేశీయంగా అత్యధిక శాతం మంది వృత్తి నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండింటి మధ్య సమతుల్యత స్థాయి ఒక మోస్తరుగానో లేదా దుర్భరంగానో ఉంటోందని 60 శాతం మంది పేర్కొన్నారు. జాబ్ కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్థిక సేవలు, నిర్మాణ తదితర రంగాల్లో 18–55 ఏళ్ల వయస్సు గల 2,000 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్‌పై ఈ సర్వే నిర్వహించారు. ఆఫీసు వెలుపల కూడా చాలా సందర్భాల్లో పని గురించే ఆలోచిస్తుండే వారి సంఖ్య 67 శాతంగా ఉంది. ఇక, పని సంబంధ ఒత్తిళ్ల కారణంగా వచ్చే మానసిక అనారోగ్యాల్లో నిద్ర లేమి (17 శాతం), డిప్రెషన్ (16 శాతం), చికాకు (9శాతం), హైపర్‌టెన్షన్ (4.5 శాతం) ఉండగా.. శారీరక అనారోగ్యాల్లో వెన్ను నొప్పి (15 శాతం), తరచూ తలనొప్పి.. అలసట (14 శాతం), స్థూలకాయం (5 శాతం) సమస్యలు ఉన్నాయి. -
శరీరానికీ సమన్వయం
1. వృక్షాసన వేరియంట్-1 సమస్థితిలో నిలబడాలి. కుడికాలు మడిచి కుడిపాదాన్ని ఎడమతొడకు లోపలివైపున నిలువుగా ఉంచి మడమకు కింది భాగానికి దగ్గరగా తీసుకువచ్చి కుడిమోకాలుకి కుర్చీ చేతిని ఆధారం చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ నమస్కార ముద్రలో ఉంచాలి. మెడనొప్పి లేదా స్పాండిలైటిస్ సమస్య ఉన్నట్లయితే చేతులు విడివిడిగా భుజాలకు సమాంతర దూరంలో ఉంచడం మంచిది. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ చేతుల్ని మణికట్టు దగ్గర రిలాక్స్డ్గా ఉంచి కిందకు తేవాలి. ఇదే విధంగా కుడికాలుపై నిలబడి కూడా చేయాలి. 2. వృక్షాసన (వేరియంట్ 2) సమస్థితిలో నిలబడాలి. శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని మడిచి చీలమండలాన్ని లేదా పాదాన్ని ఎడమ చేత్తో పట్టుకోవాలి. కాలి మడమను గట్టిగా పిరుదుల భాగానికి నొక్కుతూ కుడి చేతిని స్ట్రెచ్ చేస్తూ నిదానంగా పైకి తీసుకెళ్లాలి. మడిచిన ఎడమ మోకాలికి కింద కుర్చీని సపోర్ట్‌గా ఉంచాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ కుడిచేతిని పక్క నుంచి కిందకు నెమ్మదిగా తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమకాలి మీద నిలబడి చేయాలి. 3. వృక్షాసన వేరియంట్-3 సమస్థితిలో నిలబడాలి. మడిచిన కుడి కాలుని కుర్చీ పై నుంచి తీసుకువెళ్లి మోకాలు కుర్చీ మీద ఉంచాలి. కుడి చేతిని వెనుక నుంచి తీసుకెళ్లి కుడి చేత్తో కుడిపాదాన్ని పట్టుకొనే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని పైకి తీసుకెళ్లి స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత ఎడమ చేతిని కిందకు, కుడికాలుని సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇలాగే రెండవ వైపున కూడా చేయాలి. మడిచి ఉంచిన కుడి పాదాన్ని కుడిచేత్తో పట్టుకోవడం సాధ్యపడకపోయినా నిరుత్సాహపడకుండా కుడిపాదాన్ని ఎడమచేత్తో పట్టుకుని గట్టిగా నాభి కింద భాగానికి పక్కగా నొక్కిపెడుతూ శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకి తీసుకె ళ్లాలి. ఉపయోగాలు: కాలి కండరాలకు బిగువను కలుగు చేస్తుంది. తొడకండరాలని శక్తివంతంగా మారుస్తుంది. చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూండడం వలన వెన్నెముకకి, డిస్కుల వ్యాకోచత్వానికి వెన్నెముక అలైన్‌మెంట్‌కి ఉత్తమమైన ఆసనం. కుడి ఎడమల మధ్య సరైన సమతుల్యం లోపించడం వల్లనే వృధ్ధాప్యంలో జారిపడిపోయే సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఆసనం సమన్వయాన్ని అందిస్తుంది. 4. గరుడాసన సమస్థితిలో నిలబడాలి. ఎడమకాలుమీద స్థిరంగా నిలబడి ఎడమకాలుని కొంచెం వంచి కుడికాలుని ఎడమకాలు మీదుగా తీసుకెళ్లి కుడిపాదాన్ని ఎడమ మోకాలి కింది భాగంలో చుట్టి వెనుక నుంచి లాక్ చేసే ప్రయత్నం చేయాలి. రెండు కుర్చీల ఆధారంగా ఒక కాలును రెండవ కాలుతో చుట్టే ప్రయత్నం చేయడం కొంచెం తేలికే. పూర్తిగా బ్యాలెన్స్ చేసి నిలబడిన తర్వాత చేతులను కూడా ఎదురుగా ఉంచి కుడి మోచేతి కింద నుంచి ఎడమ చేయిని తీసుకెళ్లి నమస్కారముద్రలో నిలబడే ప్రయత్నం చేయవచ్చు. ఉపయోగాలు: సయాటికా, రుమాటిజం వంటి సమస్యలకి, బ్యాలెన్సింగ్‌ను పెంపొందించడానికి పిరుదులు, తొడలు, పిక్క కండరాల టోనింగ్‌కు ఉపకరిస్తుంది. -
సమన్వయంతో పనిచేయాలి
మంత్రి జోగు రామన్న మండలాభివృద్ధిపై సుదీర్ఘంగా కొనసాగిన సమావేశం గైర్హాజరైన అధికారులపై చర్యలకు ఆదేశం ఆదిలాబాద్ రూరల్ : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు వాటి ఫలాలు పొందలేకపోతున్నారన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ నైతం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలాభివృద్ధి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. – సమావేశంలో ఆర్‌డబ్ల్యూస్ అధికారులు సరైనా రీతిలో సమాధానాలు చెప్పకపోవడంతో ఎన్నిసార్లు చెప్పిన మీరూ మారారా.. అని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. – రైతుల కోసం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాను తమకు అందించాలన్నారు. బిందు సేద్యం ద్వారా వ్యవసాయ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, సబ్సిడీ విషయాలు తెలపాలన్నారు. – అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాలను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించాలన్నారు. – వచ్చే మాసంలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. – తాను భూమి పూజ చేసిన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంపై పంచాయతీ రాజ్ ఏఈపై మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో తననే పక్కతోవ పట్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. – శ్మశాన వాటికల ఏర్పాటు కోసం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. – బట్టిసావర్గాం ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థులతో విద్యార్థులు గొడవ పడితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సంబంధిత పాఠశాల హెచ్ఎం టీసీ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని సర్పంచ్ రామారావు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి సంబంధిత పాఠశాల హెచ్ఎం కఠిన చర్యలు తీసుకేనేలా డీఈవోకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, ఎంపీడీవో ర వీందర్, తహశీల్దార్ వర్ణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. కొందరు అధికారుల గైర్హాజరు సమావేశానికి మంత్రి వస్తున్నారని సమాచారం ఉన్నా కొంత మంది అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గైర్హాజరైన అధికారుల వివరాలను వెంటనే కలెక్టర్‌కు అందించాలని, నామమాత్రంగా నోటీసులు జారీ చేయకుండా, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆలస్యంగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం మంత్రి రావడం ఆలస్యం కావడంతో ఆయన ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది. ప్రారంభమైన 45 నిమిషాల పాటు వివిధ సమస్యలపై చర్చించి భోజన విరామం ప్రకటించారు. సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ఎదురు చూసి ఇంటికి వెళ్లిపోయారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు మంత్రి జోగు రామన్న వచ్చారు. -
రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో పని చేయాలి
కడప కల్చరల్ : రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సభా భవనంలో ఇసుక మైనింగ్, అమ్మకాలపై ఆయా శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇసుక అమ్మకాలు పరిశీలించినపుడు కొన్ని మండలాల్లో అతి తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని తెలిపారు. ఎర్రగుంట్ల, మైదుకూరు మండలాల్లో అమ్మకాలు జరగనట్లుందన్నారు. కోడూరు మండలంలో అధికంగా అమ్మకం జరగ్గా, ఆ తర్వాత స్థానంలో ప్రొద్దుటూరు నిలిచిందన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ అమ్మకాలు జరగకుండా పోలీసు, రెవెన్యూశాఖలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పోలీసు గస్తీని పెంచుతామన్నారు. డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 17 రీచ్‌ల నుంచి ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. ఈనెల 10 నుంచి ఇసుక వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అన్ని రీచ్‌లలో సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొబైల్ టీములను క్రియాశీలకం చేస్తామన్నారు. అనుమతికి మించి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను మోటారు ఇన్స్పెక్టర్లు పరిశీలించాలని, తహశీల్దార్లు, ఇన్స్పెక్టర్లు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎద్దుల బండ్ల ద్వారా ఇసుక రవాణా జరగకుండా చూడాలని, క్యూబిక్ మీటరు ఇసుక రూ. 650లు ఉండేదని, రూ. 50కు తగ్గించామని, మరో రూ. 50 తగ్గిం చేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ తెలి పారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నరాముడు, ప్రభాకర్పిళ్లై, వినాయకం, డీటీసీ బసిరెడ్డి, డీఎస్పీలు, తహశీల్దార్లు, సీఐలు, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదులో పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి కడప సెవెన్‌రోడ్స్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 10వ తేదీలోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి అనూప్‌సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2016కు సంబంధించి ఫారం-6, 7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి నివేదికను పంపాలన్నారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటే జనాభా ప్రాతిపదిక ప్రకారం పోలింగ్ స్టేషన్లు అదనంగా ఏర్పాటు చేయాలని, ఇందుకు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఓటర్ల నమోదు ఇంటి నెంబర్ల ప్రకారం పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఓటర్ల నమోదు సమయంలో ఆధార్ సీడింగ్ తప్పనిసరిగా చేపట్టాలన్నారు. ఓటర్లు ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి ఉన్నా, చనిపోయి ఉన్నా వారి పేర్లు జాబితాలో నుంచి తొలగించాలని చెప్పారు. ప్రత్యేక ఓటరు జాబితా వివరాలు ప్రతినెలా రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లాలో 53 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈనెల 10వ తేదీలోపు పరిష్కరించి నివేదిక పంపాలని కలెక్టర్ కేవీ రమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ, జేసీ రామారావు, డీఆర్వో సులోచన, జెడ్పీ సీఈఓ రజియాబేగం, ఆర్డీఓలు చిన్నరాముడు, ప్రభాకర్పిళ్లై, వినాయకం, డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, పలువురు తహశీల్దార్లు పాల్గొన్నారు. -
సమన్వయ లోపంవల్లే ఇదంతా..
-
సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం
విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారెడ్డి అనంతపురం అర్బన్:సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించుకుందామని వైఎస్సార్సీపీకి అనుబంధంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన సంఘ జిల్లా స్థారుు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకుల నుంచి వేతనాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ 10 శాతం ఐఆర్ వచ్చేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కష్టాలు తెలిసినందున వాటిని తీర్చేందుకు పాటుపడతామని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైన ఫాలోఅప్‌కు చేయడానికి తిరుపతిలో ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడానికి కార్మికులంతా పాటుపడాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఏపీఎస్పీడీ సీఎల్ అధ్యక్షుడు ఆర్.రమేష్‌బాబు, ఏపీఎస్పీడీసీఎల్ డిస్కం కార్యదర్శి బి.బాలాజీ, రాష్ట్ర అధికారి ఎస్.మహబూబ్ బాషా తదితరులు మాట్లాడారు. వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల నూతన జిల్లా కమిటీ ఇదే... వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘం విద్యుత్ ఉద్యోగుల సంఘ నూతన కమిటీకి ఎన్నికలు జరిగాయి. రీజినల్ అధ్యక్షుడిగా టి.వి.రామ్సుదర్శన్(యూడీసీ, ఈఆర్ఓ అనంతపురం), కార్యదర్శిగా ఎం.అబ్దుల్ ఖాదర్ బాషా(యూడీసీ డివిజన్ ఆఫీసు అనంతపురం), వర్కింగ్ అధ్యక్షుడిగా జి.రామకృష్ణ(లైన్‌మన్ ఉరవకొండ), అదనపు కార్యదర్శిగా వి.ఎం.విన్సంట్ కుమార్(యూడీసీ గుంతకల్లు), కోశాధికారిగా జి.విక్టర్ విజయ్‌కుమార్(లైన్యన్ అనంతపురం), అడ్వైజర్‌గా కొర్రపాడు హుస్సేన్ పీరా(అనంతపురం) ఎన్నికయ్యూరు. ఈ కమిటీతో పాటు అనంతపురం అపరేషన్ డివిజన్ కార్యకవర్గాన్ని ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షుడిగా ఎ.ఖాదర్ బాషా, కార్యదర్శిగా ఇ.గురుస్వామి, వర్కింగ్ అధ్యక్షుడిగా డి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా బి.నాగరాజు, కోశాధికారిగా బి.రాజశేఖర్ ఎంపికయ్యూరు. కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం, ఎంఆర్ డివిజన్లకు సంబంధించిన ప్యానల్ ఎన్నికలను వారంలోగా నియమించనున్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. జనవరి 10,11 తేదీల్లో భద్రాచలంలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం రామాలయ ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాలకు మూడు రోజుల ముందుగానే ఏర్పాట్లన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సామాన్య భ క్తులే ఉత్సవాలకు వీఐపీలని, వారికి సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ఉత్సవాల విశిష్టత, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, అందజేసే సౌకర్యాలు గురించి భక్తులు పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు పట్టణంలోని వీలైనన్ని చోట్ల ఎక్కువగా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం బస్టాండ్, ఉత్సవాల ప్రాంగణంలో పాటు, అవసరమైన చోట్ల మరుగుదొడ్లు, మూత్ర శాలలను నిర్మించాలన్నారు. వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక వసతి కేంద్రాలను నిర్మించాలన్నారు. వసతి కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి ఏర్పాట్లతో పాటు వైద్యశిబిరాలను కూడా అక్కడ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గతంలో ఉత్సవాల టిక్కెట్లు మిగిలిపోయినందున ఈసారి వాటిని ఆన్లైన్ ద్వారా విక్రయిస్తే బాగుంటుందని, దీనిపై తగు ఆలోచన చేయాలన్నారు. అదే విధంగా పట్టణంలో పది చోట్ల టిక్కెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వీటిపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గోదావరి నదిలో సరిపడా నీరు ఉన్నందున ఈసారి హంసవాహనంపైనే తెప్పోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ పనులు జనవరి 7 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 8న ట్రైయల్ రన్ నిర్వహించేందుకు హంస వాహనం సిద్ధం చేయాలని సూచించారు. ఉత్సవాల్లో పాల్గొనే అన్ని శాఖల ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. మరో వారం రోజుల తరువాత ఏర్పాట్లపై సమీక్షిస్తానని చెప్పారు. రుచికరమైన భోజనం పెట్టకపోతే హోటళ్లను సీజ్ చేయండి : పీవో వీరపాండియన్ భక్తులకు రుచికరమైన భోజనం పెట్టని హోటళ్లను గుర్తించి వాటిని సీజ్ చేయాలని ఐటీడీఏ పీవో వీరపాండియన్ ఆదేశించారు. ఉత్సవాల సమయంలో కొంతమంది హోటళ్ల నిర్వాహకులు భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ధరల దోపిడీ చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తోందని, దీనిపై ఆహార తనిఖీ అధికారులు తగు దృష్టి సారించాలన్నారు. సాధారణ రోజుల్లో ఎలాగూ పట్టించుకోరు....కనీసం ఉత్సవాల సమయంలోనైనా హోటళ్లను తనిఖీ చేయండని సంబంధిత శాఖ అధికారులకు చురకలు వేశారు. ఆహార తనిఖీ అధికారులు గత ఏడాది ఎన్ని కేసులు నమోదు చేశారనే దానిపై ప్రశ్నించగా సదరు అధికారులు నీళ్లు నమిలారు. ఈ సాైరె నా కాస్త దృష్టి సారించి పనిచేయాలని సూచించారు. ఉత్సవాలతో భద్రాద్రి అభివృద్ధి చెందాలి : ఎస్పీ రంగనాథ్ ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల ద్వారా భద్రాచలం మరింత అభివృద్ధి చెందే విధంగా తగు ప్రణాళికలు తయారు చేస్తే బాగుంటుందని జిల్లా ఎస్పీ రంగనాథ్ అన్నారు. ఆయా శాఖల ద్వారా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కాకుండా శాశ్వత ప్రయోజనాలు కలిగేలా చూడాలని అధికారులను కోరారు. భద్రాచలం బ్రిడ్జి ముఖ ద్వారంలో భక్తులకు చెత్త కుప్పలు స్వాగతం పలకడం ఎంతమాత్రం సమంజసంకాదని, దీనిపై పంచాయతీ వారు ప్రత్యేక దృష్టి సారించి వాటిని అక్కడ నుంచి తరలించాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బారికేడ్లను సక్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ఉత్సవాలను భక్తులంతా తిలకించే ందుకు ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీలను, అలాగే భక్తులకు తగు సమాచారం అందించేందుకు ‘మే ఐ హెల్ప్‌యూ’ కౌంటర్లను ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. ఈవో రఘునాథ్ దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలకు చేపట్టే పనులను వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, భద్రాచలం ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి,ఆలయ ప్రధానర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయా శాఖల అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తర ద్వారం, కరకట్ట తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.