సమన్వయంతో పని చేయండి | Co-ordinated with Work | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పని చేయండి

Published Tue, Jul 8 2014 12:48 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Co-ordinated with Work

 విజయనగరం కంటోన్మెంట్:ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. సోమవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ  ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మం డల సమావేశాలు నిర్వహించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించాలన్నారు. డీఆర్‌డీఏ ద్వారా అమలవుతున్న ఎన్‌హెచ్‌జీ గ్రూపుల వివరాలు, వాటి పనితీరు, శిక్షణలు, బ్యాంకు లింకేజి, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, స్త్రీనిధి, ఆమ్ ఆద్మీ, బంగారు తల్లి, జన శ్రీ పథకాలపై డీఆర్‌డీఏ పీడీ టి.జ్యోతి పవర్ పాయింట్ ప్రజం టేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ 1999 నుంచి ఇప్పటివరకు జిల్లాలో బ్యాంక్ లింకేజి కింద రూ.212.2 కోట్లు పంపిణీ చేశామన్నారు. 2014-15కు వార్షిక ప్రణాళిక కింద రూ.552 కోట్లను వివిధ పద్దుల కింద పంపిణీ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు.
 
 నిరుపేద ల సమగ్రాభివృద్ధి పథకం కింద రూ.130 కోట్లను వస్తువులు, యం త్రాల రూపంలో అందించామన్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం డీఆర్‌డీఏ ద్వారా 183 ఎన్‌డీసీసీలను నడిపిస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి అనేకమంది గ్రామీణ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. బంగారు తల్లి పథకం కింద  ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే  వరకూ వివిధ దశల కింద రూ.1,55,500 లక్షలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ 10,186 మంది ఈ పథకం కింద నమోదైనట్టు చెప్పారు. చిన్నారులకు పూర్వ విద్యను అందించేందుకు 60 బాల బడులను నినర్వహిస్తున్నామని, వాటిలో 1036 మంది పిల్లలు పూర్వ వి ద్యను అభ్యసిస్తున్నారని దీని పర్యవేక్షణ శోధన అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోందన్నారు.
 
 ఇంటితో పాటు మరుగుదొడ్డి తప్పనిసరి
 గృహ నిర్మాణాలు చేపట్టేటపుడు ప్రతి ఇంటికీ  మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చూడాలని మంత్రి మృణాళిని ఆదేశించారు. ఈ సం దర్భంగా జిల్లాలోని గృహ నిర్మా ణ శాఖ ప్రగతిని పీడీ కుమార్ వివరించారు. ఇప్పటివరకు 6,03,320 గృహాలను మంజూరు చేశామన్నారు. ఇందులో 4,90,000 పూర్తయ్యాయని, 1,13,000పైగా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. గ్రా మీణ ప్రాంతాల్లో ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్షా 5వేలు చొప్పున నిర్మాణ వ్యయాన్ని అందిస్తున్నామన్నారు. ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 వేలు, పట్టణ ప్రాంతాలల్లో రూ.80వేలను అందిస్తున్నట్టు తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ పరిధిలో ఆర్‌ఆర్ ప్యాకేజి కింద 3,920 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.50వేలు, మరుగుదొడ్డి కోసం మూడు వేలు, అందిస్తున్నట్టు తెలిపారు.ఈ సమీక్షలో జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, పార్వతీపురం, ఎస్.కోట ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
 
 రాత్రి పది తర్వాత మద్యం షాపుల బంద్
 మద్యం దుకాణాలను ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించి రాత్రి పదిగంటలకు మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. సోమవారం ఆమె డీఆర్‌డీఏ సమావేశ మందిరం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్ట్ షాపులు ఇంకా కొన్ని చోట్ల నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతోందనీ, వాటిపై కొరడా ఝళిపిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్టు షాపులు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   
 
 జిల్లా అభివృద్ధికి కృషి
 జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు నత్తనడకన సాగుతున్నాయని. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం కష్టపడి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.  పనిచేసే చోటే ప్రభుత్వ సిబ్బంది నివాసం ఉండాలన్నారు. చెరుకు రైతులకు  సీతానగరం సుగర్ ఫ్యాక్టరీ చెల్లింపులు చేయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌కు సూచించామన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా సబ్ స్టేషన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని భరో సా ఇచ్చారు. చెన్నైలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు.
 
 వలసల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సాక్షి విలేకరి ప్రశ్నించగా.. వలసలు వెళ్లకుండా నిరోధించాలని గ్రామ సర్పంచ్‌లు, పెద్దల ద్వారా ప్రచారం కల్పించనున్నామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చెన్నైలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి లో ఆరుగురికి జిల్లా నిధుల నుంచి రూ.5లక్షల చొప్పున పరిహా రం అందించామన్నారు. మిగిలిన వారికి వ్యక్తిగత చెక్కులు తయారుచేసి పంపిస్తామని కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారన్నారు. గాయపడిన వారికి రూ.50వేలు, ప్రతి కుటుంబానికీ వేతన నష్టం కింద మరో రూ.25వేలు అందిస్తామని చెప్పారు. చెన్నై ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల పరిహారం తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement