
నీతూప్రసాద్ బదిలీ అనివార్యమే!
కాకినాడ సిటీ : కలెక్టర్ నీతూప్రసాద్ బదిలీపై గత నాలుగు నెలలుగా ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరపడనుంది. సోమవారం అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన జాబితా గెజిట్ పబ్లికేషన్ జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఐఏఎస్‌ల విభజనకు సంబంధించిన ఫైల్‌పై ప్రధాని రెండురోజుల క్రితం సంతకం చేసిన విషయం తెలిసిందే. సోమవారం గెజిట్ పబ్లికేషన్ జరిగితే కలెక్టర్ ఆరోజు సాయంత్రం లేదా మంగళవారం ఉదయం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పర్మిషన్‌తో హైదరాబాద్ వెళ్ళి రిపోర్టు చేస్తారని తెలుస్తోంది.