(ఫైల్ ఫోటో)
సాక్షి, శ్రీకాకుళం: పరిశ్రమల భద్రత, సురక్షిత అంశాలను పరిశీలించాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల భద్రతపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకర రసాయనాలు కలిగిన కర్మాగారాలను పరిశీలించాలని తెలిపారు. ప్రమాదకరమైన విష వాయువులు, రసాయన వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అగ్నిమాపక కోణంలో కూడా తనిఖీ చేయాలని..పరిశ్రమలు విధిగా అన్ని సురక్షిత, భద్రతా చర్యలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పరిశ్రమల్లో సిబ్బంది మాస్కులు కలిగి ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు,ఫోమ్,నీటితో నియంత్రణ చేసే పరికరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment