శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు అ వసరానికి అనుగుణంగా పొరుగు సేవల సిబ్బం దిని అందిస్తున్న గుర్తింపు పొందిన వివిధ ఏజెన్సీల పనితీరును జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం ఆయన కార్యాలయంలో బుధవారం సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొ రుగు సేవల సిబ్బందికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, సర్వీసు టాక్స్ వంటి సేవలు ఉద్యోగులకు అందిస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు.
సిబ్బందికి ఉండే సదుపాయాలను ఏజెన్సీలు పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిని ఆదేశించారు. ఏజెన్సీలకు ఇతర సమస్యలుంటే వాటి పరిష్కా రం కోసం ప్రభుత్వంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. పలు ఏజెన్సీ లు గత కొన్ని నెలలుగా సిబ్బంది జీతాలకు చెల్లించాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, 2015 నుంచి 15 శాతం సర్వీస్ టాక్స్‌ను కొన్ని ప్రభుత్వ శాఖలు చెల్లించడం లేదని, వాటిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కామేశ్వరరావు, ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకులు రామకోటి, ఆర్ట్స్, అక్షయ్, సాయిసూర్య ప్లేస్‌మెంట్స్, ఇన్‌టైమ్ సర్వీసెస్, ఫోర్‌విన్ సెక్యూరిటీ, బైట్ అండ్ బ్యూటిఫుల్ ఫెసిలిటీ, ఎస్‌వీఎస్ కంప్యూటర్స్, శ్రీబాలాజీ ఉద్యోగ సాయిశీల వంటి గుర్తింపు పొందిన ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏజెన్సీల పనితీరుపై కలెక్టర్ సమీక్ష
Published Wed, Jul 13 2016 11:48 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement