ఆక్రమణలపై కలెక్టర్ సీరియస్
Published Thu, Aug 29 2013 3:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై కలెక్టర్ అహ్మద్ బాబు కొరడా ఝళిపించారు. పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేసిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని బల్దియూ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారి పక్కన అక్రమంగా ఏర్పాటుచేసిన షెడ్లు, దుకాణాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ ప్రక్రియను ఆక్రమణదారు లు, రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకునేం దుకు యత్నించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తున్నారని, ఈ చర్యతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.
స్పందించిన ఆర్డీవో కలెక్టర్ ఆదేశాల మేరకే తాము ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలుంటే ఆయనకు విన్నవించాలని స్పష్టం చేశారు. దీంతో ఆయూ దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సుమా రు గంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. రోడ్డు పక్కనే గణపతి విగ్రహాలు తయారు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయం చూ పాలని బీజేపీ నాయకులు ఆర్డీవోను కోరగా పట్టణంలోని రాంలీలా మైదానంలో పండుగ రోజుల వరకు ప్రత్యామ్నాయంగా ఉండొచ్చని ఆయన సూచించారు.
ఆక్రమణల తొలగింపు ఒక్క ప్రాంతానికే పరిమితం చేయరాదని, అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశం మేరకు అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆర్డీవో వెంట మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్, తహశీల్దార్ దత్తు, ఫుడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మహ్మద్ అయాజ్, జగదీశ్వర్‌గౌడ్ ఉన్నారు. ఆందోళన చేసిన వారిలో పార్టీల నా యకులు పాయల శంకర్, యూనిస్ అక్బానీ, సాజిద్‌ఖాన్, దుకాణదారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement