రుతుపవనాలు 5న తాకుతాయట! | coming soon to southwest monsoon | Sakshi
Sakshi News home page

రుతుపవనాలు 5న తాకుతాయట!

Published Tue, Jun 2 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

coming soon to southwest monsoon

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కేరళను ఈ నెల 5న తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడిం చింది. పశ్చిమ, నైరుతి గాలుల ఉధృతి, లక్షద్వీప్‌లో వర్షపాతం పెరగడం వల్ల రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకుని ఐదో తేదీకి కేరళ తీరాన్ని తాకవచ్చని వివరిం చింది.

మారిన పరిస్థితుల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) రా ష్ట్రంలో వడగాడ్పుల హెచ్చరికలను ఉపసంహరించుకుంది. ఎక్కడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావని, ఇకపై  వడగాడ్పుల పరిస్థితి తలెత్తదని సోమవారంనాటి నివేదికలో స్పష్టం చేసింది. దీంతో జనం ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement