నేనున్నానని..
సాక్షి, కడప/పులివెందుల : టీడీపీ ప్రభుత్వ ఆరంభం నుంచి ఆత్మహత్య చేసుకున్న తు కుటుంబాలను పరామర్శిస్తానని అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నాలుగు రోజుల్లోనే పులివెందుల నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించారు. అప్పులు ఎక్కువై.. తీర్చే దారిలేక.. విషపు గుళికలు మింగి తనువు చాలించిన చిన్నరంగాపురానికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. గురువారం సాయంత్రం గ్రామంలో యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి భార్య, పిల్లలను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.
వైఎస్ జగన్‌కు ప్రశంసల జల్లు :
క్రిస్మస్‌పండుగ నాడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతోనే గడిపారు. చర్చిలో ప్రార్థనల అనంతరం నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యా రు. వారు చెబుతున్న సమస్యలు వింటూ పరి ష్కారానికి చొరవ చూపారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై చేసిన ఎదురుదాడి, రైతుల పక్షాన చూ పిన తెగువ, రాజధానికి సంబంధించిన బిల్లు విషయంలో రైతుల తరఫున పోరాటంపై పలువురు వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తా రు. కొందరుపూలబొకేలతో అభినందించగా మరికొందరు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజల తరఫున పోరాడటానికి జగన్ ఉన్నారన్న ధైర్యం జనంలో నింపావని కొనియాడారు.
రుణమాఫీ అమలు కాలేదని.. :
పులివెందుల మున్సిపాలిటీలోని చిన్నరంగాపురం గ్రామంలో కౌన్సిలర్ వీరశేఖరమ్మ ఇంటి కి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటి వద్దకు వైఎస్ జగన్ రాగానే గ్రామానికి చెందిన వికలాంగ రైతు హరినారాయణరెడ్డి కలిశారు. నాలుగేళ్లయింది.. బంగారు రుణం ’80వేలు.. క్రాప్ లోను ’90వేలు తీసుకున్నానని.. రుణమాఫీ పెసా కాలేదని.. గ్రామానికంతా కలిపి నలుగురు రైతులకే వచ్చిందని వైఎస్ జగన్‌కు వివరించారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ ఇదంతా మోసపూరిత ప్రభుత్వమన్నా.. రైతులను నిలువునా బాబు ముంచాడు.. మీ తరఫున పోరాటానికి సిద్ధమని ఊరడించారు.
పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు అందించండి :
కరువు రైతులను ఆదుకొనేందుకు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు (పీబీసీ)కి అదనంగా మరో టీఎంసీ నీటిని అందించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మంత్రిని డిమాండు చేశారు. గురువారం పులివెందులలోని ఇంట్లో వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అనంతపురం, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ప్రతి ఏటా పీబీసీకి అన్యాయం జరుగుతోందని.. వచ్చిన నీరు కాస్తా అనంతపురం జిల్లాలోని కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల నియోజకవర్గాలలోని ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు.
ఆయకట్టుకు 1.2టీఎంసీలు.. తాగునీటి అవసరాలకు 2టీఎంసీల చొప్పున కేటాయించారని.. అవి కూడా సక్రమంగా రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింహాద్రిపురం, లింగాల మండలాల్లో చీనీ, అరటి రైతులు వేలాది ఎకరాల్లో చెట్లను నరికివేశారని.. ఈ సారి కూడా ఆయకట్టుకు రాకపోతే చెట్లను మరిన్ని వందల ఎకరాల్లో కొట్టేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు ఇవ్వడంతోపాటు పోతిరెడ్డిపాడు, గండికోట వరద కాలువకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
ఈ ఏడాది వరద నీరు సక్రమంగా నిలబెట్టుకోలేక వందల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయని.. పోతిరెడ్డిపాడు - గండికోట మధ్య కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా కనీసం 25టీఎంసీలనుంచి 30టీంఎసీల నీటిని నిలబెట్టుకోవచ్చునన్నారు. తద్వారా నీరు గండికోటకు తీసుకరావచ్చునని.. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలియజేశారు. అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి పరిహార సమస్యలు తీర్చాల్సి ఉందని.. వెంటనే ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని కోరినట్లు వైఎస్ అవినాష్ స్పష్టం చేశారు. మంత్రితోపాటు అనంత, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లు కూడా న్యాయం చేస్తామని చెప్పడమేకాక సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు.
మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై పోరాడుతా :
బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేయడమే పనిగా పెట్టుకున్నారని.. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో పోరాటం చేశానని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల రింగ్ రోడ్డు సమీపంలో వైఎస్ జగన్‌ను పలువురు మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు అడ్డగోలుగా తొలగిస్తున్నారని మొరపెట్టుకున్నారు. వారి కోసం పోరాటం చేస్తామని హామి ఇచ్చారు.
క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో...
పులివెందులలో గురువారం క్రిస్మస్ వేడుకల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులంతా స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్నారు. వైఎస్ జగన్‌రెడ్డితోపాటు మామ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, పెదనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి తదితరులు కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాలు పంచుకున్నారు.
చర్చి వద్దనే ఆరుబయట మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, విమలమ్మ కుమారుడు యువరాజారెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అలాగే జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో కూడా వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, రాజమ్మలు ప్రత్యేక ప్రార్థనలలో పాలుపంచుకున్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, మేయర్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలను పలువురు నేతలు కలుసుకున్నారు. ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చెర్మైన్ విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి చర్చించారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం అనేక అంశాలపై చర్చించారు.