christamas festival
-
కళ్లు చెదిరేలా న్యూ ఇయర్ సేల్, స్మార్ట్ ఫోన్ కొంటే.. స్మార్ట్ వాచ్ ఫ్రీ!
హైదరాబాద్: టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలపై డీల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ధర రూ.12,999తో 5జీ స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. దీనికి అదనంగా రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్‌ను(బ్రాండ్లను బట్టి) ఉచితంగా అందిస్తుంది. పార్టీ స్పీకర్లను రూ.2199 ప్రారంభ ధరతో అందిస్తుంది. సౌండ్బార్లపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్లైన్ పోర్టల్ కొనుగోలుపై ఈ ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. -
ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ప్రజలందరూ క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్. -
వైరల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
-
‘లేవగానే నన్ను ఏడిపించింది’
ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా స్ఫూర్తిదాయక అంశాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియోతో ఆనంద్ మహీంద్రా నెటిజనుల ముందుకు వచ్చారు. ‘ఈ రోజు ఉదయం లేవగానే మీరు నన్ను ఏడిపించారు. నాకు మనవరాలు లేదు.. కానీ ఈ వయసు మనవడు ఉన్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో నెటిజనులను కూడా కదిలిస్తోంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది అనుకుంటున్నారా.. అయితే చదవండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో షూట్ చేసిన యాడ్‌కు సంబంధించిన వీడియోని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. (చదవండి: 'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..) ఇక ఈ వీడియో ప్రారంభం కాగానే ఓ తాత కనిపిస్తాడు. ఉదయం లేచి స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఓ ఇనుప బంతిని తీసుకొస్తాడు. దాన్ని తన రూమ్‌లోకి తీసుకువచ్చి.. ఓ ఫోటో ఎదురుగా నిల్చుని ఎత్తేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ బరువు మోయలేక వెంటనే ఎత్తేస్తాడు. ఇరుగు పొరుగు వారితో పాటు ప్రేక్షకులకు కూడా ఈయన ఈ ఏజ్‌లో ఎందుకు వ్యాయామం చేస్తున్నాడా అనే అనుమానం మొదలువుతుంది. ఇదిలా ఉండగా ఆ వృద్ధుడు మరుసటి రోజు ఉదయం ఆరుబయట ఓ చిన్న కుర్చిపై ఫోటో పెట్టుకుని బరువు ఎత్తడం ప్రాక్టీస్ చేస్తాడు. ఈ సారి విజయం సాధిస్తాడు. ఇలా కొన్ని రోజులు పాటు ఆయన సాధన కొనసాగిస్తాడు. ఆ తర్వాత క్రిస్టమస్ నాడు రెడీ అయ్యి గిఫ్ట్ బాక్స్ తీసుకుని కుమార్తె ఇంటికి వెళ్తాడు. ఇంతలో మనవరాలు వస్తుంది. తన చేతిలోని గిఫ్ట్ బాక్స్‌ని ఆమెకి ఇస్తాడు. చిన్నారి ఆ బాక్స్ ఒపెన్ చేసి చూడగా అందులో స్టార్ ఉంటుంది. (చదవండి: ‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’) ఇక వృద్ధుడు మనవరాలిని ఎత్తుకోగా ఆమె స్టార్‌ని తీసుకెళ్లి క్రిస్టమస్ ట్రీలో అంలకరిస్తుంది. కుమార్తె తండ్రిని చూసి ఆనందంతో కంటతడి పెడుతుంది. ఇక చివరగా వృద్ధుడు మొదట్లో చూపించే ఫోటోని రివీల్ చేస్తారు. దానిలో అతడి మనవరాలు ఉంటుంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక ఆనంద్ మహీంద్రా దీన్ని షేర్ చేసిన గంటల వ్యవధిలోనే దాదాపు 20 వేల మందికిపైగా దీన్ని వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ‘మమ్మల్ని కూడా కదిలించింది.. మేం కూడా ఏడిచాం.. ఇంత మంచి వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
కోవిడ్ లోనూ క్రిస్మస్ ఆనందం!!
లోకపరమైన అభ్యున్నతిని ఆశీర్వాదంగా భావించవద్దు. అవసరాలకు మించిన డబ్బు, సంపదలు, గిడ్డంగుల నిండా ఆహారముండటమే గొప్ప జీవితమైతే, అత్యంత హేయమైన సంస్కృతులకు నిలయంగా ఉన్న బబులోను సామ్రాజ్యంలో కూడా అవన్నీ ఉన్నాయని, దేవుడు తన ప్రజల జీవితాల్లో కోరుకునేది ధర్మశాస్త్రబద్ధమైన నీతి, నియమాలు, మౌలిక విలువలు, దైవభయంతో కూడిన పరిశుద్ధజీవితమని యెషయాప్రవక్త హెచ్చరించాడు (యెషయా 1:2–31). మితిమీరిన సంపదలు, అహంకారంతో, అంధత్వంలో కూరుకుపోయిన ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు. అనూహ్యంగా, బబులోను సైన్యాలు చేసిన దాడిలో ఒక్క రోజులోనే వాళ్ళ జీవితాలు తలకిందులయ్యాయి. తాము పరలోకపు రాజధానిగా భావించిన యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు ధ్వంసం చేసి పాడుదిబ్బగా మార్చారు, సుందరమైన ఆలయాన్ని కొల్లగొట్టి, దానిలోని బంగారాన్నంతా దోచుకుపోయారు. తాము తిరుగులేని శూరులము, మేధావులమనుకున్న చాలామందిని బబులోనుకు బానిసలుగా చెరపట్టుకొని వెళ్లారు. వాళ్ళ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రకాశవంతమైన వాళ్ళ దేశం కాస్తా చీకటికూపంగా మారింది. అయితే దేవుడు వాళ్ళను 70 ఏళ్ళ చెర తర్వాత మళ్ళీ వెనక్కు తెచ్చినా, పూర్వవైభవం మాత్రం వాళ్లకు మళ్ళీ దక్కలేదు. ఈ సారి రోమా ప్రభుత్వ నిరంకుశ పాలన వారిని యెరూషలేములోనే మరింత అణిచివేసింది. అంధకారంలో ఉన్నవాళ్లు వెలుగు కోసం, ఆపదలో కూరుకుపోయినవాళ్లు సహాయకుని కోసం, బానిసత్వం లో మగ్గిన ప్రజలు స్వాతంత్య్రం, ఆత్మగౌరవాన్ని ప్రసాదించే విమోచకుని కోసం ఎదురు చూస్తారు. అందుకే బాధిత ప్రజల ఆక్రందనలకు జవాబుగా మానవచరిత్రనంతటినీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తుశకం అనే రెండు భాగాలుగా విడదీస్తూ, రెండువేల ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన యేసుక్రీస్తులో ఒక గొప్ప వెలుగును, కృపామయుడైన సహాయకుణ్ణి, మహా విమోచకుణ్ణి, ‘దేవుని రాజ్యం’ అనే ఒక నవలోకనిర్మాతను లోకం కనుగొంది. దేవుని అద్వితీయ కుమారుడైన దైవలోకనిత్యపాలకుడే, ‘యేసుక్రీస్తు’ నామధారిగా, అతిసామాన్యమైన మానవరూపిగా, బేత్లెహేమనే కుగ్రామంలో, ఒక పశువుల శాలలో శిశువుగా ఈ భూగ్రహంపైన పాదం మోపాడు. మెస్సీయాగా దైవకుమారుడు ఈ లోకానికి వస్తాడని బైబిల్ చెబితే, మేధావులు, సంపన్నులు, పాలకుల భవంతుల్లో ఆయన జననం, ఆగమనం కోసం ఎదురుచూసిన ఆత్మీయ అజ్ఞానులైన యూదులు, ఒక నిరుపేదగా, సాదాసీదాగా జన్మించిన రక్షకుని గుర్తించలేకపోయారు. అయితే వాళ్ళు పోగొట్టుకున్నదే, సర్వలోకానికి మహా భాగ్యమైంది. ఈసారి ప్రభువు యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి వరప్రదాత, సార్వజనిక విమోచకుడయ్యాడు. కటిక చీకట్లో కూడా తప్పక ఒక కాంతిరేఖ ఉద్భవిస్తుందన్న ‘ఆశల్ని’ రేకెత్తిస్తూ, విమోచకుని రాకను మరోసారి గుర్తు చేస్తూ ఈ కోవిడ్–19 విపత్తులో ‘క్రిస్మస్’ మళ్ళీ రానే వచ్చింది. దీన్ని డబ్బు దండగ చేసుకునే పండుగలా కాదు, ఆడంబరాల కోసం కాదు, దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసే ఒక శుభప్రదమైన ఘడియగా గుర్తించి పదిమందికీ సాయం చేసి దేవుని ప్రేమను ప్రకటిద్దాం, ఆత్మీయానందాన్ని పొందుదాం, దేవుని ప్రేమతత్వాన్ని మనసారా అనుభవిద్దాం. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
8 ఏళ్ల చిన్నారి లేఖకి బదులిచ్చిన ప్రధాని
లండన్: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఇప్పటికీ మనం దాని కంట్రోల్లోనే ఉన్నాం. మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక కోవిడ్ వ్యాప్తితో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పండుగలు, వేడకలకు దూరంగా ఉన్నాయి. ఒకవేళ నిర్వహించాల్సి వచ్చినా ఎన్నో జాగ్రత్తల నడుమ అతి కొద్ది మందితో మాత్రమే జరుపుకుంటున్నారు. ఇక ఈ ఏడాదిలో మిగిలిన చివరి వేడుక, పండుగ క్రిస్టమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ శాంటాక్లాజ్.. మనదగ్గర అయితే క్రిస్మస్ తాత. క్రిస్మస్ పండుగ అనగానే చిన్నారులకు కేకులు, క్రిస్మస్ ట్రీ, స్టార్లతోపాటు శాంటాక్లాజ్ తాత కూడా గుర్తుకు వస్తాడు. ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించిన శాంటాక్లాజ్ తమకు బోలెడన్ని గిఫ్టులను తీసుకువస్తాడని పిల్లలు ఎదురు చూస్తుంటారు. రాత్రి పూట ఇంటి గుమ్మం ఎదుట సంచుల్లో ఆయన గిఫ్ట్‌లను ఉంచి వెళ్లిపోతాడని కథలు చెబుతారు. ఇక చిన్నారులు శాంటాక్లాజ్ ఇచ్చే బహుమతుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది వేడుకలకు కుటుంబ సభ్యులందరు కలవడమే వీలు కావడం లేదు.. ఇక శాంటాక్లాజ్ వస్తాడా రాడా. ఈ సందేహం ఇప్పటికే ఎందరో చిన్నారుల బుర్రలని తొలిచేస్తుంది. దీని గురించి పిల్లలంతా తల్లిదండ్రులను ప్రశ్నలు అడుగుతూ సతాయిస్తూ ఉండగా.. ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం దీని గురించి ఏకంగా ప్రధానికే ఉత్తరం రాశాడు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఎంటంటే ప్రధాని ఆ చిన్నారికి సమాధానమిస్తూ.. మరో ఉత్తరం రాశాడు. (చదవండి: ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) ఆ వివరాలు.. ఎనిమిదేళ్ల మోంటీ అనే చిన్నారి బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కి శాంటాక్లాజ్ రాక గురించి సమాధానం ఇవ్వాల్సిందిగా ఉత్తరం రాశాడు. ‘ఈ ఏడాది శాంటాక్లాజ్ వస్తాడా.. మాకు బహుమతులు ఇస్తాడా లేదా ప్లీజ్ దీని గురించి నాలానే ఇంకా చాలా మందికి అనుమానం ఉంది. శాంటాక్లాజ్ రావడం గురించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా దయచేసి క్లారిటీ ఇవ్వండి’ అంటూ మోంటో.. ప్రధానికి తన చిట్టి చిట్టి చేతులతో ఉత్తరం రాశాడు. ఈ లేఖ బోరిస్‌ని కదిలించింది. వెంటనే రిప్లై ఇచ్చారు. క్రిస్మస్ నాడు శాంటా తప్పక వస్తారు అంటూ భరోసా ఇచ్చారు. మోంటో ఉత్తరంతో పాటు తాను ఇచ్చిన రిప్లైని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు బోరిస్. ‘ఇప్పటికే నాకు ఇలాంటి లెటర్లు చాలా వచ్చాయి. దీని గురించి నిపుణులతో మాట్లాడాను. ఇక శాంటాక్లాజ్ తన సంచిని బహుమలతలో నింపుకుని ప్రయాణం అయ్యారు. క్రిస్టమస్ నాడు ఇక్కడికి తప్పక వస్తాడు. అంతేకాక ఇప్పటికే నేను ఉత్తర ధ్రువానికి కాల్ చేసి శాంటాక్లాజ్‌ని రావాల్సిందిగా ఆహ్వానించాను. ఆయన తప్పక వస్తారు’ అంటూ ట్వీట్ చేశారు బోరిస్. ప్రస్తుతం ఈ సంభాషణ తెగ వైరలవుతోంది. ఇక పండుగ సమయంలో ప్రజలు తగిన కోవిడ్ నియమాలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేడుకలు సంతోషంగా ముగుస్తాయన్నారు. (ప్రధాని పెద్ద మనసు: బిడ్డకు వైద్యుడి పేరు) Monti (aged 8) wrote to me asking if Father Christmas will be able to deliver presents this year 🎅🎁🎄 I've had lots of letters about this, so I have spoken with experts and can assure you that Father Christmas will be packing his sleigh and delivering presents this Christmas! pic.twitter.com/pXwcjHSxZg — Boris Johnson (@BorisJohnson) November 25, 2020 -
‘ప్రాణం’ కమలాకర్ పాట ఏడు భాషల్లో..
సాక్షి, లక్డీకాపూల్: సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్ పేరు చెప్పగానే ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం.. స్వర్గమవ్వాలి వనవాసం’ పాట గుర్తొస్తుంది. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ చిత్రం ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ కానుకగా ‘కమనీయమైన.. రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అంటూ సాగే రెండు గాస్పల్ సాంగ్స్ (సువార్త పాటలు) కంపోజ్ చేశారు. ప్యాషన్ ఫర్ క్రైస్ట్ – జోష్వాషేక్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రాణం’ కమలాకర్ మాట్లాడుతూ– ‘‘క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన సంగీత దర్శకత్వంలో డివోషనల్ టచ్ ఉండేలా రెండు పాటలను కంపోజ్ చేశామన్నారు. ‘కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా..’ అనే పాట ఏడు భాషల్లో విడుదలైందన్నారు జోష్వా షేక్ లిరిక్స్ అందించారు. ‘రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అనే పాటను కూడా అతనే రాసినట్లు తెలిపారు. మధురై, కేరళ నుంచి రిథమ్ సెక్షన్, కేరళ నుంచి కొరియోగ్రాఫర్స్‌ను పిలిపించి రికార్డ్ చేసినట్లు ఆయన వివరించారు. -
బాబోయ్.. అంత డబ్బుతో తనేం చేస్తుందో!?
క్రిస్మస్ సీజన్ మొదలైంది. ఈ సందర్భంగా పండగకు ఏమేం తీసుకోవాలి.. తనకు ఏమి కావాలో ఓ పదేళ్ల చిన్నారి బహుమతుల జాబితాను రాసుకుంది. క్రిస్మస్కు ఇవి కావాలంటూ ఆ జాబితాను తన తండ్రికి చూపించింది. అది చూసి ఆ తండ్రి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఈ పదేళ్ల పాప ఏం అడిగి ఉంటుందిలే ఏవో ఆడుకునే బొమ్మలు, పండగకి కొత్త బట్టలు, లేదంటే ఆడుకోవడానికి సైకిల్ అలాంటివేవో అడిగి ఉంటుందిలే అనుకుంటే పొరబడినట్లే. వివరాలు.. కిస్మస్ పండగ కోసం ఓ పదేళ్ల పాప తనకు కావాలసిన వస్తువులను ఓ కాగితంపై రాసి తన తండ్రి జాన్సన్‌కు ఇచ్చింది. మొత్తం 26 వస్తువులు కావాలంటూ రాసిచ్చిన ఆ జాబితా చూసి జాన్సన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. జాబితాలో పండక్కి వేసుకొవడానికి కొత్త డ్రెస్సులతో పాటు ఐఫోన్11, మాక్‌బుక్ ఎయిర్లతో పాటు రూ. 4వేల డాలర్లు కావాలని రాయడంతో కంగుతిన్నాడట. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ చిన్నారి బహుమతుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ‘నా పదేళ్ల కుతూరు ఈ క్రిస్మస్కు రాసుకున్న బహుమతుల జాబితా తన మెదడు పరిమితిని దాటింది’ అనే టైటిల్‌తో షేర్ చేసిన పోస్టుకు వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి. My 10 year old daughter must be out of her mind with this Christmas list 😒😒😒 pic.twitter.com/Qqsje79rda — @A_Johnson412 (@a_johnson412) November 13, 2019 ఈ క్రమంలో ‘ఆ చిన్ని మెదడులో ఇంత పెద్ద జాబితా ఉందా! నాకు ఆశ్చర్యంగా ఉంది.. ఇంతకి ఈ చిన్నారి అంత డబ్బుతో ఏం చేయాలనుకుంటుందో?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. Am I the only one wondering what a 10yr old wants to do with $4000? pic.twitter.com/9WZAu8dcIc — Lesego Semenya (@LesDaChef) November 15, 2019 -
నేనున్నానని..
సాక్షి, కడప/పులివెందుల : టీడీపీ ప్రభుత్వ ఆరంభం నుంచి ఆత్మహత్య చేసుకున్న తు కుటుంబాలను పరామర్శిస్తానని అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నాలుగు రోజుల్లోనే పులివెందుల నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించారు. అప్పులు ఎక్కువై.. తీర్చే దారిలేక.. విషపు గుళికలు మింగి తనువు చాలించిన చిన్నరంగాపురానికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. గురువారం సాయంత్రం గ్రామంలో యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి భార్య, పిల్లలను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్‌కు ప్రశంసల జల్లు : క్రిస్మస్పండుగ నాడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతోనే గడిపారు. చర్చిలో ప్రార్థనల అనంతరం నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యా రు. వారు చెబుతున్న సమస్యలు వింటూ పరి ష్కారానికి చొరవ చూపారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై చేసిన ఎదురుదాడి, రైతుల పక్షాన చూ పిన తెగువ, రాజధానికి సంబంధించిన బిల్లు విషయంలో రైతుల తరఫున పోరాటంపై పలువురు వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తా రు. కొందరుపూలబొకేలతో అభినందించగా మరికొందరు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజల తరఫున పోరాడటానికి జగన్ ఉన్నారన్న ధైర్యం జనంలో నింపావని కొనియాడారు. రుణమాఫీ అమలు కాలేదని.. : పులివెందుల మున్సిపాలిటీలోని చిన్నరంగాపురం గ్రామంలో కౌన్సిలర్ వీరశేఖరమ్మ ఇంటి కి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటి వద్దకు వైఎస్ జగన్ రాగానే గ్రామానికి చెందిన వికలాంగ రైతు హరినారాయణరెడ్డి కలిశారు. నాలుగేళ్లయింది.. బంగారు రుణం ’80వేలు.. క్రాప్ లోను ’90వేలు తీసుకున్నానని.. రుణమాఫీ పెసా కాలేదని.. గ్రామానికంతా కలిపి నలుగురు రైతులకే వచ్చిందని వైఎస్ జగన్‌కు వివరించారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ ఇదంతా మోసపూరిత ప్రభుత్వమన్నా.. రైతులను నిలువునా బాబు ముంచాడు.. మీ తరఫున పోరాటానికి సిద్ధమని ఊరడించారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు అందించండి : కరువు రైతులను ఆదుకొనేందుకు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు (పీబీసీ)కి అదనంగా మరో టీఎంసీ నీటిని అందించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మంత్రిని డిమాండు చేశారు. గురువారం పులివెందులలోని ఇంట్లో వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అనంతపురం, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ప్రతి ఏటా పీబీసీకి అన్యాయం జరుగుతోందని.. వచ్చిన నీరు కాస్తా అనంతపురం జిల్లాలోని కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల నియోజకవర్గాలలోని ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు. ఆయకట్టుకు 1.2టీఎంసీలు.. తాగునీటి అవసరాలకు 2టీఎంసీల చొప్పున కేటాయించారని.. అవి కూడా సక్రమంగా రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింహాద్రిపురం, లింగాల మండలాల్లో చీనీ, అరటి రైతులు వేలాది ఎకరాల్లో చెట్లను నరికివేశారని.. ఈ సారి కూడా ఆయకట్టుకు రాకపోతే చెట్లను మరిన్ని వందల ఎకరాల్లో కొట్టేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు ఇవ్వడంతోపాటు పోతిరెడ్డిపాడు, గండికోట వరద కాలువకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది వరద నీరు సక్రమంగా నిలబెట్టుకోలేక వందల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయని.. పోతిరెడ్డిపాడు - గండికోట మధ్య కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా కనీసం 25టీఎంసీలనుంచి 30టీంఎసీల నీటిని నిలబెట్టుకోవచ్చునన్నారు. తద్వారా నీరు గండికోటకు తీసుకరావచ్చునని.. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలియజేశారు. అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి పరిహార సమస్యలు తీర్చాల్సి ఉందని.. వెంటనే ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని కోరినట్లు వైఎస్ అవినాష్ స్పష్టం చేశారు. మంత్రితోపాటు అనంత, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లు కూడా న్యాయం చేస్తామని చెప్పడమేకాక సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు. మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై పోరాడుతా : బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేయడమే పనిగా పెట్టుకున్నారని.. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో పోరాటం చేశానని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల రింగ్ రోడ్డు సమీపంలో వైఎస్ జగన్‌ను పలువురు మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు అడ్డగోలుగా తొలగిస్తున్నారని మొరపెట్టుకున్నారు. వారి కోసం పోరాటం చేస్తామని హామి ఇచ్చారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో... పులివెందులలో గురువారం క్రిస్మస్ వేడుకల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులంతా స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్నారు. వైఎస్ జగన్రెడ్డితోపాటు మామ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, పెదనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి తదితరులు కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాలు పంచుకున్నారు. చర్చి వద్దనే ఆరుబయట మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, విమలమ్మ కుమారుడు యువరాజారెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అలాగే జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో కూడా వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, రాజమ్మలు ప్రత్యేక ప్రార్థనలలో పాలుపంచుకున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, మేయర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలను పలువురు నేతలు కలుసుకున్నారు. ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చెర్మైన్ విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి చర్చించారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం అనేక అంశాలపై చర్చించారు.