‘లేవగానే నన్ను ఏడిపించింది’ | Anand Mahindra On Christmas Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా

Published Tue, Dec 15 2020 8:44 PM | Last Updated on Tue, Dec 15 2020 8:51 PM

Anand Mahindra On Christmas Video - Sakshi

ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా స్ఫూర్తిదాయక అంశాలను సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియోతో ఆనంద్‌ మహీంద్రా నెటిజనుల ముందుకు వచ్చారు. ‘ఈ రోజు ఉదయం లేవగానే మీరు నన్ను ఏడిపించారు. నాకు మనవరాలు లేదు.. కానీ ఈ వయసు మనవడు ఉన్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన వీడియో నెటిజనులను కూడా కదిలిస్తోంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది అనుకుంటున్నారా.. అయితే చదవండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్‌ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో షూట్‌ చేసిన యాడ్‌కు సంబంధించిన వీడియోని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. (చదవండి: 'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..)

ఇక ఈ వీడియో ప్రారంభం కాగానే ఓ తాత కనిపిస్తాడు. ఉదయం లేచి స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లి ఓ ఇనుప బంతిని తీసుకొస్తాడు. దాన్ని తన రూమ్‌లోకి తీసుకువచ్చి.. ఓ ఫోటో ఎదురుగా నిల్చుని ఎత్తేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ బరువు మోయలేక వెంటనే ఎత్తేస్తాడు. ఇరుగు పొరుగు వారితో పాటు ప్రేక్షకులకు కూడా ఈయన ఈ ఏజ్‌లో ఎందుకు వ్యాయామం చేస్తున్నాడా అనే అనుమానం మొదలువుతుంది. ఇదిలా ఉండగా ఆ వృద్ధుడు మరుసటి రోజు ఉదయం ఆరుబయట ఓ చిన్న కుర్చిపై ఫోటో పెట్టుకుని బరువు ఎత్తడం ప్రాక్టీస్‌ చేస్తాడు. ఈ సారి విజయం సాధిస్తాడు. ఇలా కొన్ని రోజులు పాటు ఆయన సాధన కొనసాగిస్తాడు. ఆ తర్వాత క్రిస్టమస్‌ నాడు రెడీ అయ్యి గిఫ్ట్‌ బాక్స్‌ తీసుకుని కుమార్తె ఇంటికి వెళ్తాడు. ఇంతలో మనవరాలు వస్తుంది. తన చేతిలోని గిఫ్ట్‌ బాక్స్‌ని ఆమెకి ఇస్తాడు. చిన్నారి ఆ బాక్స్‌ ఒపెన్‌ చేసి చూడగా అందులో స్టార్‌ ఉంటుంది. (చదవండి: ‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?)

ఇక వృద్ధుడు మనవరాలిని ఎత్తుకోగా ఆమె స్టార్‌ని తీసుకెళ్లి క్రిస్టమస్‌ ట్రీలో అంలకరిస్తుంది. కుమార్తె తండ్రిని చూసి ఆనందంతో కంటతడి పెడుతుంది. ఇక చివరగా వృద్ధుడు మొదట్లో చూపించే ఫోటోని రివీల్‌ చేస్తారు. దానిలో అతడి మనవరాలు ఉంటుంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక ఆనంద్‌ మహీంద్రా దీన్ని షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే దాదాపు 20 వేల మందికిపైగా దీన్ని వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ‘మమ్మల్ని కూడా కదిలించింది.. మేం కూడా ఏడిచాం.. ఇంత మంచి వీడియో షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement